కోడి రక్తంతో పూజలు..వీడియో తీసి మహిళలకు పంపించి భయపెట్టి డబ్బులు దోచేస్తున్న దొంగబాబా

కోడి రక్తంతో పూజలు..వీడియో తీసి మహిళలకు పంపించి భయపెట్టి డబ్బులు దోచేస్తున్న దొంగబాబా

Nellore Fake Baba arrested : నెల్లూరు జిల్లాలో ఓ దొంగస్వామి మహిళల్ని హడలెత్తిస్తున్నాడు. భయపెట్టి డబ్బులు గుంజుతున్నాడు. కోడి రక్తంతో పూజలు చేసి దాన్ని వీడియోలు తీసి స్థానిక మహిళ ఫోన్ నంబర్లు తెలుసుకుని వారికి ఈ వీడియోలు పంపించి భయపెడుతున్నాడు.నేను చెప్పినట్లుగా చేయకపోతే మీకు అంతా నష్టమే జరుగుతుంది. ప్రాణాలే పోతాయని భయపెడుతున్నాడు. క్షుద్ర పూజలు పేరుతో భయపెట్టి డబ్బులు గుంజుతున్నాడు.

మహిళలను టార్గెట్‌గా చేసుకుని అడిగినంత డబ్బు ఇవ్వకపోతే చేతబడి చేసి మీ కుటుంబాన్ని నాశనం చేస్తానంటూబెదిరిస్తున్నాడు. దీంతో నెల్లూరు జిల్లాలోని వేదాయపాలానికి చెందిన ఇద్దరు మహిళలు భయపడిపోయి ఈ విషయాన్ని పోలీస్ స్టేషన్ కొచ్చి చెప్పుకున్నాడు. తమకు పంపించిన వీడియోలు చూపించి డబ్బుల కోసం ఓ బాబా బెదిరిస్తున్నాడని చెప్పారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సదరు దొంగబాబా కళాకారుల సంఘానికి చెందిన మిరియాల రమణయ్య అని గుర్తించారు. అనంతరం ఆ దొంగబాబాకు అరదండాలు వేశారు.

రాష్ట్ర కళాకారుల సంఘం అధ్యక్షుడు మిరియాల రమణయ్య, తన ఇంటిలో క్షుద్ర పూజలు చేస్తూ కోడిని కోసి కోడి రక్తంతో అమ్మవారి పూజలు చేస్తూ ఆ పూజా కార్యక్రమాన్ని వీడియో తీసి మహిళలకు పంపిస్తూ భయబ్రాంతులకు గురి చేస్తున్నాడు. తాను చెప్పింది చేయకపోతే చేతబడులు, క్షుద్రపూజలు చేస్తానని..మీ కుటుంబాలకు నాశనం తప్పదని భయపెడుతూ..వీడియోలు పంపిస్తూ మహిళలను భయభ్రాంతులకు గురి చేస్తూ.. వారి నుంచి డబ్బులు గుంజుతున్నాడు.

తన వద్దకు వచ్చిన మహిళలను వలలో వేసుకొని ‘‘నేను సాక్షాత్తే పరమశివుడి అవతారాన్ని భక్తులు కష్టాల్లో ఉంటే తీర్చేవాడిని కాబట్టి మీరంతా నా మాట వినాలి. నేను ఏది చెబితే అది చేయాలంటూ నానా హంగామా చేస్తున్నాడు. మెడలో రుద్రాక్ష మాలలు వేసుకుని కోడి రక్తం గుండెల మీద పూసుకొని కోడి రక్తంతో శివుడికి పూజ చేస్తున్నాడు. ఇంట్లోనే రక్తం చిందిస్తూ.. రకరకాల పూజలు చేస్తూ..ఏవేవో మంత్రాలు చదువుతూ..ఆ పూజలను వీడియో తీసి..

మహిళలకి పంపిస్తూ భయబ్రాంతులకు గురి చేస్తున్నాడు. దీనికి గురించి ఎవరైనా ప్రశ్నిస్తే హోంమంత్రితో దిగిన ఫోటోలు చూపించేవాడు. అలా పలువురిని బెదిరించి అందినకాడికి దండుకుంటున్నాడు.

ఈ వీడియోలు చూసి కొంతమంది భయపడిపోయారు. మానసిక క్షోభకు గురయ్యారు. ఆ వీడియోలు చూస్తుంటే భయాందోళనతో జ్వరం వచ్చి మంచానపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. మదనపల్లిలో జరిగిన ఘటనతో అప్రమత్తమైన కొంతమంది నెల్లూరు వేదాయపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని నిందితుడు వెంకటరమణ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.