AP Corona Cases : ఏపీలో కొత్తగా 244 కరోనా కేసులు

రాష్ట్రంలో గడిచిన 24గంట్లలో కొత్తగా 244 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో ఇద్దరు కోవిడ్ తో మరణించారు. చిత్తూరు, కృష్ణా జిల్లాలలో ఒక్కొక్కరు చొప్పున చనిపోయారు.

AP Corona Cases : ఏపీలో కొత్తగా 244 కరోనా కేసులు

Ap Corona Cases

AP Corona Cases : ఏపీలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి తగ్గింది. కొత్త కేసులు భారీగా తగ్గాయి. రాష్ట్రంలో గడిచిన 24గంట్లలో కొత్తగా 244 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో ఇద్దరు కోవిడ్ తో మరణించారు. చిత్తూరు, కృష్ణా జిల్లాలలో ఒక్కొక్కరు చొప్పున చనిపోయారు. గడిచిన 24 గంటల్లో 662 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో 24గంటల వ్యవధిలో 18వేల 803 కరోనా టెస్టులు చేశారు.

నేటివరకు రాష్ట్రంలో 3,30,10,692 కోవిడ్ పరీక్షలు చేశారు. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 23,16,711. రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 22,96,430. రాష్ట్రంలో ఇప్పటివరకు కోవిడ్ తో చనిపోయిన వారి సంఖ్య 14వేల 716కి పెరిగింది. ప్రస్తుతం 5వేల 565 కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి.

భారత్ ను భయాందోళనకు గురి చేసిన కరోనా మహమ్మారి క్రమంగా అదుపులోకి వస్తోంది. కొన్ని రోజులుగా కొత్త కేసులు గణనీయంగా తగ్గుముఖం పడుతున్నాయి. వరుసగా మూడోరోజు 20 వేల దిగువనే కేసులు నమోదయ్యాయి. తాజాగా 13 వేలకు తగ్గాయి. పాజిటివిటీ రేటు 1.24 శాతానికి క్షీణించింది. మృతుల సంఖ్య కూడా అదుపులోనే ఉంది.

Covid Rules : కోవిడ్ నిబంధనలు అతిక్రమిస్తే రూ.25వేలు ఫైన్, ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

సోమవారం 10,84,247 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 13వేల 405 మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. ముందురోజు కంటే కేసులు 16 శాతం మేర తగ్గాయి. ఇప్పటివరకూ 4.28 కోట్ల మందికి కరోనా సోకింది. ఇక 24 గంటల వ్యవధిలో మరో 235 మంది కోవిడ్ తో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 5,12,344కి పెరిగింది.

Corona Vaccination: దేశంలో 80శాతం మంది వయోజనులకు రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తి

కరోనా వ్యాప్తి అదుపులో ఉండటంతో యాక్టివ్ కేసులు 2 లక్షల దిగువకు చేరాయి. ప్రస్తుతం ఆ కేసులు 1,81,075గా ఉండగా.. క్రియాశీల రేటు 0.42 శాతానికి తగ్గింది. నిన్న 34,226 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీలు 4.21 కోట్ల(98.38 శాతం)కు పైనే. ఇక నిన్న 35,50,868 మంది టీకా తీసుకున్నారు. ఇప్పటివరకూ 175 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయని కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు మంగళవారం కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు తెలిపింది.