AP Corona Bulletin : ఏపీలో కొత్తగా 75 కరోనా కేసులు

ఏపీలో గడిచిన 24 గంటల్లో 11వేల 846 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 75మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.(AP Corona Bulletin)

AP Corona Bulletin : ఏపీలో కొత్తగా 75 కరోనా కేసులు

Ap Corona

AP Corona Bulletin: ఏపీలో గడిచిన 24 గంటల్లో 11వేల 846 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 75మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. రాష్ట్రంలో ఒక్క కరోనా మరణం కూడా నమోదు కాకపోవడం ఊరటనిచ్చే అంశం. గడిచిన 24 గంటల వ్యవధిలో మరో 46మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. నేటి వరకు రాష్ట్రంలో 3,31,14,755 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. నేటివరకు రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 14వేల 730గా ఉంది. రాష్ట్రంలో ఇంకా 536 కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 23,19,141 పాజిటివ్ కేసులు నమోదవగా.. 23,03,875 మంది కోలుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు 11వేల 594 కరోనా పరీక్షలు నిర్వహించగా 54 పాజిటివ్ కేసులు వచ్చాయి.

ఇక జిల్లాల వారిగా చూస్తే.. గత 24 గంటల్లో.. అత్యధికంగా అనంతపురం జిల్లాలో 23 కరోనా కేసులు వచ్చాయి. తూర్పు గోదావరి జిల్లాలో 14 కేసులు, విశాఖపట్నంలో 11 కేసులు వచ్చాయి. కర్నూలు, శ్రీకాకుళం జిల్లాలలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.(AP Corona Bulletin)

దేశంలో కరోనా వైరస్ కట్టడిలోనే ఉంది. కొన్ని రోజులుగా కొత్త కేసులు 3వేలకు దిగువనే నమోదవుతున్నాయి. నిన్న 6 లక్షల మందికి పైగా కరోనా పరీక్షలు చేయించుకోగా.. 2వేల 528 మందికి పాజిటివ్‌గా తేలింది. మరోపక్క మరణాల్లో మాత్రం హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ముందురోజు ఆ సంఖ్య 60గా ఉండగా.. 24 గంటల వ్యవధిలో 149కి చేరింది. కేరళలో కరోనా లెక్కలు సవరిస్తుండటమే ఈ భారీ వ్యత్యాసానికి కారణం. ఇక ఇప్పటివరకు 4.30 కోట్ల మందికి కరోనా సోకగా.. 5.16 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.

Covid 4th Wave Alert : కరోనా నాల్గో వేవ్‌ ముప్పు.. రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలి : కేంద్రం

కొవిడ్ వ్యాప్తి అదుపులో ఉండటంతో యాక్టివ్ కేసులు గణనీయంగా తగ్గిపోతున్నాయి. ప్రస్తుతం 30వేల దిగువకు చేరి.. మొత్తం కేసుల్లో 0.07 శాతానికి క్షీణించాయి. నిన్న 3వేల 997 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీలు 4.24 కోట్లు(98.73 శాతం) దాటాయి. మరోపక్క దేశంలో టీకా కార్యక్రమం దశలవారీగా ముందుకు సాగుతోంది. ఇప్పటివరకూ 180.9 కోట్ల డోసులు పంపిణీ అయినట్లు కేంద్రం తెలిపింది. నిన్న 15.7 లక్షల మంది టీకా తీసుకున్నారు. ఈ మేరకు కేంద్రం శుక్రవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది.

India Covid : భారత్‌‌లో కరోనా తగ్గుముఖం.. 24 గంటల్లో 2,528 కేసులు

కొన్ని వారాలుగా తగ్గుముఖం పట్టిన కరోనా మహమ్మారి.. మళ్లీ విజృంభిస్తున్నట్లు కన్పిస్తోంది. చైనా సహా ఆగ్నేయ ఆసియా, యూరప్ లోని కొన్ని దేశాల్లో కొన్ని రోజులుగా కొత్త కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో భారత్‌లోనూ ఫోర్త్ వచ్చే అవకాశాలున్నట్లు వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. వైరస్‌ పట్ల నిర్లక్ష్యంగా ఉండొద్దంటూ రాష్ట్రాలను హెచ్చరించింది. ప్రజలంతా నిబంధనలు పాటించేలా చూడాలని, టెస్టులు పెంచాలని సూచించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాశారు.