AP Covid Cases Report : ఏపీలో కరోనా ఖతమ్..! ఒకే ఒక్క కేసు నమోదు

రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 2వేల 726 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా ఒక పాజిటివ్ కేసు మాత్రమే నమోదైంది.(AP Covid Cases Report)

AP Covid Cases Report : ఏపీలో కరోనా ఖతమ్..! ఒకే ఒక్క కేసు నమోదు

Ap Corona

AP Covid Cases Report : ఏపీలో కరోనావైరస్ మహమ్మారి ఖతమ్ అయినట్టేనా? తాజాగా నమోదైన కరోనా బాధితుల గణాంకాలు అవుననే చెబుతున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 2వేల 726 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా ఒకే ఒక్క పాజిటివ్ కేసు మాత్రమే నమోదైంది. అదీ తూర్పుగోదావరి జిల్లాలో వెలుగుచూసింది. 13 జిల్లాలకు గాను 12 జిల్లాల్లో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాకపోవడం, కరోనా మరణాలేవీ సంభవించకపోవడం ఊరటనిచ్చే అంశాలు.

గడిచిన 24 గంటల్లో మరో 32 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. నేటివరకు రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 14వేల 730. రాష్ట్రంలో ఇంకా 119 కొవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. నేటివరకు రాష్ట్రంలో 23,19,578 పాజిటివ్ కేసులు నమోదవగా.. 23,04,729 కోవిడ్ నుంచి కోలుకున్నారు. నేటివరకు రాష్ట్రంలో 3,34,53,397 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. కాగా, ఏపీలో గత రెండుజులుగా కరోనా కేసుల బులెటిన్ విడుదల చేయలేదు. నేడు తాజా బులెటిన్ విడుదల చేయగా, ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి.

అటు దేశవ్యాప్తంగా కరోనావైరస్ వ్యాప్తి పూర్తిస్థాయిలో అదుపులోకి వస్తోంది. తాజాగా కొత్త కేసులు వెయ్యిలోపు నమోదుకావడం భారీ ఊరట కలిగిస్తోంది. ఇక కోవిడ్ మరణాలు 20 దిగువకు తగ్గిపోయాయి. ఆదివారం 3 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 913 మందికి కరోనా సోకినట్లు తేలింది. 715 రోజుల తర్వాత ఈ స్థాయిలో కేసులు క్షీణించాయి. ముందురోజు(1,096) కంటే 16 శాతం మేర కేసులు తగ్గాయి. రోజువారీ పాజిటివిటీ రేటు ఒక శాతం దిగువనే ఉంది. ఇప్పటివరకూ 4.30 కోట్లకు పైగా కరోనా కేసులొచ్చాయి.

CHINA COVID CASES : చైనాను వదలని కరోనా.. ఒక్కరోజే 13వేల కేసులు నమోదు.. కొత్త వేరియంట్ తో కలకలం

24 గంటల వ్యవధిలో మరో 13 మంది కోవిడ్ తో ప్రాణాలు కోల్పోయారు. క్రితం రోజు ఆ సంఖ్య 81గా ఉంది. ఇప్పటివరకూ దేశంలో 5.21 లక్షల మంది కరోనాకు బలయ్యారు. నిన్న 1,316 మంది కోలుకోగా.. యాక్టివ్ కేసులు 12 వేలకు దిగొచ్చాయి. యాక్టివ్ కేసుల రేటు 0.03 శాతంగా ఉండగా.. రికవరీ రేటు 98.76 శాతంగా కొనసాగుతోంది.

వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. నిన్న రెండు లక్షల మందికి పైగా టీకా తీసుకోగా.. మొత్తంగా 184 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి తగ్గుతుంటే.. చైనా, బ్రిటన్‌ వంటి పలు దేశాల్లో కరోనా మళ్లీ కోరలు చాస్తోంది.(AP Covid Cases Report)

చైనాలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ముఖ్యంగా అతిపెద్ద నగరం, వాణిజ్య రాజధాని అయిన షాంఘైలో వైరస్‌ వ్యాప్తి విపరీతంగా ఉంది. దేశంలో మొత్తంగా నమోదవుతున్న కేసుల్లో దాదాపు 70 శాతం ఈ ఒక్క నగరంలోనే బయటపడుతున్నాయి. దీంతో అప్రమత్తమైన చైనా ప్రభుత్వం.. షాంఘైలో వైరస్‌ వ్యాప్తి కట్టడికి చర్యలు చేపట్టింది. పరీక్షలను పెంచడంతో పాటు పెద్ద ఎత్తున ఆరోగ్య కార్యకర్తలు, సైన్యాన్ని నగరానికి పంపింది.

China Covid 4th Wave : చైనాలో కరోనా విజృంభణ.. 2ఏళ్ల రికార్డు బ్రేక్.. ఒక్కరోజే భారీగా కేసులు

చైనాలో కొన్ని రోజులుగా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. సోమవారం దేశవ్యాప్తంగా 13వేలకు పైగా కొత్త కేసులు నమోదవ్వగా.. ఇందులో దాదాపు 9వేల కేసులు ఒక్క షాంఘైలోనే ఉండటం ఆందోళనకు గురి చేస్తోంది. ఈ నగరంలో వైరస్‌ ఉధృతి ఎక్కువగా ఉండటంతో గతవారం లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. నగర వ్యాప్తంగా దాదాపు అన్ని కార్యకలాపాలను నిలిపివేసి, కఠినమైన లాక్‌డౌన్‌ విధించి.. ప్రజలను ఇళ్లకే పరిమితం చేసినప్పటికీ షాంఘైలో కేసులు పెరుగుతున్నాయి. దీంతో అధికారులు సోమవారం నుంచి ట్విన్‌ కొవిడ్‌ పరీక్షలు మొదలుపెట్టారు. అంటే నగరంలో ప్రతి పౌరుడికి యాంటీజెన్, న్యూక్లిక్‌ యాసిడ్‌ పరీక్షలు చేస్తున్నారు.