Andhra Pradesh: మరోసారి సత్తాచాటిన ఆంధ్రప్రదేశ్.. ఆ విషయంలో దేశంలోనే నెంబర్ వన్..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈజ్ ఆఫ్ డూయింగ్ ర్యాంకింగ్స్ లో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచి సత్తా చాటింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం బిజినెస్ రీఫార్మ్స్ యాక్షన్ ప్లాన్ -2020లో టాప్ అచివర్స్ లో ఏడు రాష్ట్రాలను ప్రకటించారు.

Andhra Pradesh: మరోసారి సత్తాచాటిన ఆంధ్రప్రదేశ్.. ఆ విషయంలో దేశంలోనే నెంబర్ వన్..

Ap Cm Jagan

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈజ్ ఆఫ్ డూయింగ్ ర్యాంకింగ్స్ లో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచి సత్తా చాటింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం బిజినెస్ రీఫార్మ్స్ యాక్షన్ ప్లాన్ -2020లో టాప్ అచివర్స్ లో ఏడు రాష్ట్రాలను ప్రకటించారు. ఈ లిస్టు లో ఏపీ మొదటి స్థానంలో నిలిచింది. టాప్ అచివర్స్ లో ఏపీతో పాటు గుజరాత్, హర్యానా, కర్నాటక, పంజాబ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలు ఉన్నాయి.

Auto Catches Fire In AP : ఆటో ప్రమాదం పాపం ‘ఉడుత’దే..మా తప్పేమీ లేదు : ఏపీ ఎస్పీడీసీఎల్‌ సీఎండీ

కేంద్ర ప్రభుత్వం మొత్తం నాలుగు కేటగిరీల్లో రాష్ట్రాలకు ర్యాంకులు ఇచ్చింది. గతంలో ఎప్పుడూలేని విధంగా ఈసారి కొత్త విధానాలతో కేంద్రం ఈ ర్యాంకింగ్ ప్రక్రియను చేపట్టింది. 10,200 మంది పెట్టుబడిదారులు, వాటాదారుల నుండి ఫీడ్‌బ్యాక్ సేకరించబడింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో 97.89శాతం స్కోర్ తో ఏపీ మొదటి స్థానంలో నిలిచింది. కాగా గుజరాత్‌ 97.77 శాతం, తమిళనాడు 96.97 శాతం, తెలంగాణ 94.86 శాతంతో రెండో స్థానంలో నిలిచాయి.

Searching For Tiger: పులి ఎటు వెళ్లింది..? పులి జాడకోసం కొనసాగుతున్న వేట..

అచివర్స్‌ జాబితాలో హిమాచల్‌ ప్రదేశ్‌, మధ్యప‍్రదేశ్‌, మహారాష్ట్ర, ఒడిషా, ఉత్తరాఖండ్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలు ఉన్నాయి. అస్పిరర్స్‌ జాబితాలో అసోం, ఛత్తీస్‌గఢ్‌, గోవా, జార్ఖండ్‌, కేరళ, రాజస్థాన్‌, పశ్చిమ బెంగాల్‌ ఉన్నాయి. మరోవైపు.. ఎమర్జింగ్​ బిజినెస్​ ఎకోసిస్టమ్స్​ విభాగంలో 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు నిలిచాయి. వీటిలో ఢిల్లీ, పుదిచ్చేరి, త్రిపుర ప్రాంతాలు చోటు దక్కించుకున్నాయి.