Searching For Tiger: పులి ఎటు వెళ్లింది..? పులి జాడకోసం కొనసాగుతున్న వేట..

కోస్తా ప్రజలను పులి భయబ్రాంతులకు గురిచేస్తోంది. నెల రోజులుగా కాకినాడ జిల్లాలో అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించిన పులి.. బుధవారం అనకాపల్లి జిల్లా ఏజెన్సీలో సంచారంతో స్థానికులను భయబ్రాంతులకు గురిచేసింది.

Searching For Tiger: పులి ఎటు వెళ్లింది..? పులి జాడకోసం కొనసాగుతున్న వేట..

Tiger

Searching For Tiger: కోస్తా ప్రజలను పులి భయబ్రాంతులకు గురిచేస్తోంది. నెల రోజులుగా కాకినాడ జిల్లాలో అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించిన పులి.. బుధవారం అనకాపల్లి జిల్లా ఏజెన్సీలో సంచారంతో స్థానికులను భయబ్రాంతులకు గురిచేసింది. కోటవురట్ల మండలం టి. జగ్గపేట శివారు శ్రీరాంపురంలో చిన్న అనే రైతుకు చెందిన గేదెపై పులి దాడికి పాల్పడింది. ఈ దాడిలో గేదె మృత్యువాత పడటంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నాయి.

Tiger Search: ఇంకా చిక్కని పులి.. కొనసాగుతున్న గాలింపు

పులి జాడను గుర్తించేందుకు అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగారు. అనకాపల్లి ఏజెన్సీ ఏరియాలో పులికోసం వెతుకులాట ప్రారంభించారు. పులి కోటవురట్ల అటవీ ప్రాంతంలో కొండపైకి వెళ్లి ఉంటుందని అటవీ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రాంతంలో భారీగా సీసీ కెమెరాలను అమర్చారు. పులి దాదాపు 30కి.మీ దూరం ప్రయాణించే అవకాశం ఉంటుందని భావిస్తున్న అధికారులు, ఆ మేరకు సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు చేశారు. కాకినాడలో తిరిగిన పులి, బుధవారం అనకాపల్లి జిల్లా ఏజెన్సీలో సంచరించిన పులి ఒకటేనని అటవీశాఖ అధికారులు నిర్దారించారు. కాలి అడుగుజాడల ద్వారా అటవీశాఖ అధికారులు ఈ నిర్ధారణకు వచ్చారు.

Tiger Search: ఇంకా చిక్కని పులి.. కొనసాగుతున్న గాలింపు

గత రెండు రోజుల క్రితం పులి అన్నవరానికి అత్యంత సమీపంలో ఉన్నట్టు గుర్తించారు. పులి పాదముద్రలు గుర్తించిన చోటు నుంచి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో అన్నవరం సత్యదేవుని ఆలయం ఉంది. అయితే పెద్దపులి ఆలయం వైపు వెళ్లే అవకాశం లేదని అధికారులు చెప్పడంతో అన్నవరం వెళ్లే భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా అనకాపల్లి జిల్లా ఏజెన్సీలో పులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. దీంతో స్థానిక ప్రజలు బయటకు రావాలంటేనే భయాందోళన చెందుతున్నారు.