మతిస్థిమితం లేని మహిళ మెడకు ఉరిలా చుట్టుకుపోయిన తాళ్లు..చాకచక్యంతో కాపాడిన మహిళా హోంగార్డు

మతిస్థిమితం లేని మహిళ మెడకు ఉరిలా చుట్టుకుపోయిన తాళ్లు..చాకచక్యంతో కాపాడిన మహిళా హోంగార్డు

Women Home Guard Helps Psychological Disorder Woman (1)

women home guard helps psychological  woman : ఆమె ఎవరూ పట్టించుకోని అనాథ. పైగా మతి స్థిమితం లేని మహిళ. తనకు తోచినట్లుగా బతికేస్తోంది.తనకు గుర్తుకొచ్చినపాటలు పాడుకుంటూ తిరుగుతుంటుంది. ఆకలేస్తే దొరకింది తింటుంది. లేదా పస్తుంటుంది. కంటికి కనిపించినవల్లా మెడలో వేసేసుకుని ఏపీలోని విజయనగరం జిల్లా బొబ్బిలి నగరంలో తిరుగుతుంటుంది. రోడ్డు పక్కన దొరికిన గుడ్డ పీలికలను, తాళ్లను మెడలో వేసుకొనే ఓ మహిళకు అవే ప్రమాదకరంగా మారాయి.

అవి మెడకు చుట్టుకుని చనిపోయే ప్రమాదం కూడా ఉంది. కానీ ఆమెను ఎవ్వరూ పట్టించుకోరు. వాటివల్ల తనకు ప్రమాదం జరుగుతుందనే విషయం ఆ మతిస్థిమితం లేని ఆ మహిళకు తెలీదు. అటువంటి పరిస్థితిలో నగరంలో తిరుగుతున్న మతిస్థిమితం లేని ఆమెను ఓ మహిళా హోంగార్డు చూసింది. అందరిలా ఆమె పట్టించుకోకుండా ఊరుకోలేదు. ఆమెకు సేవలందించి తన మంచి మనసును చాటుకుంది.

బొబ్బిలి నగరంలో వీధుల్లో చిన్న సంచి పట్టుకుని పట్టణంలో తిరుగుతూ తనలో తనే ఏవో పాటలు పాడుకునే ఆమెను పలకరిస్తే మాట్లాడుతుంది. మాట కలుపుతుంది. అలా పట్టణంలోని అన్ని బజార్లలో ఇటూ అటూ తిరుగుతూ తనలో తానే గొణుక్కుంటూ కనిపించిన తాళ్లు, దారాలన్నీ మెడలో వేసుకునే ఆ తాళ్లు మెడకు ఉరిలా దగ్గరికంటా బిగుసుకున్నాయి. ఈక్రమంలో అటుగా వెళ్తున్న ఝాన్సీ రాణి అనే హోంగార్డు కంట ఈమె పడింది. అయ్యో అనుకుంది. ఆమె మెడలోంచి ఆ తాళ్లను తీసేయాలను అనుకుంది. లేకుంటే ప్రమాదమని భావించిు్ీ. అలా ఆమె దగ్గరకెళ్లి..మాటలు కలిపింది. నెమ్మదిగా బుజ్జగిస్తూ చిన్నపాటి చాకుతో మెడలోని ఒక్కో పోగూ కట్ చేసి వాటినుంచి ఆమెకు పూర్తి విముక్తిని చేసింది.

ఆ తర్వాత ఆమెతో మాటలు కలిపింది ఝాన్సీరాణి. ‘‘నీ పేరు ఏంటీ అని అడిగింది. దానికామె నా పేరు జయలక్ష్మి అని చెప్పుకొచ్చింది. నువ్వేం చదువుకున్నావని అడిగింది. 6వ తరగతి చదువుకున్నానని చెప్పింది. అలా ఆమెను మాటల్లో పెట్టి మొత్తం తన మెడ చుట్టూ చుట్టుకున్న తాళ్లన్నీ తొలగించింది. అనంతరం ఓ నైటీ తీసుకువచ్చి ఆమెకు ధరింపజేసింది.

ఆ తరువాత కడుపునిండా భోజనం పెట్టింది. మా ఇంటికొస్తావా? అని అడిగితే రాను అంటూ కచ్చితంగా చెప్పింది. దీనిపై ఝాన్సీరాణి మాట్లాడుతూ.. ‘మన కుటుంబ సభ్యులైతే అలా వదిలేస్తామా? నాకు ఆమె ఓ తల్లి, ఓ అత్తమ్మ’లా అనిపించిందని అని చెప్పింది. దీంతో హోంగార్డు ఝాన్సీరాణి సపర్యలు చేయడం పట్ల పలువురు ఝాన్సీరాణిని అభినందనల్లో ముంచెత్తారు.