Election Counting: తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి!

తెలుగు రాష్ట్రాల్లో ఉపఎన్నికల పోరులో విజేతలు ఎవరో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.

Election Counting: తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి!

Counting

Election Counting: తెలుగు రాష్ట్రాల్లో ఉపఎన్నికల పోరులో విజేతలు ఎవరో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ఆంధ్ర రాష్ట్రంలో కడప జిల్లా బద్వేల్ బై పోల్ కౌంటింగ్.. తెలంగాణ రాష్ట్రంలో హుజురాబాద్ బైపోల్ కౌంటింగ్ రేపు(2 నవంబర్ 2021) జరగనుంది. కౌంటింగ్ దగ్గర పడుతున్న కొద్దీ హుజురాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల్లో టెన్షన్‌ స్టార్ట్ అయ్యింది. ప్రజా తీర్పు ఎలా ఉండబోతోందనే ఉత్కంఠతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కూడా ఎదురుచూస్తున్నారు.

ఈ క్రమంలోనే హుజురాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లును పూర్తిచేశారు అధికారులు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్‌ కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించారు. రేపుఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలు కానుండగా.. మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపు ఆ తర్వాత 8.30 నుంచి ఈవీఎంలు లెక్కింపు మొదలుకానుంది. హుజురాబాద్‌లో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య ముఖ్యంగా పోరు నడుస్తుంది.

బద్వేల్ మాత్రం గెలుపు ఎట్టిపరిస్థితుల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదేననే అంచనాలు ఉండగా.. రేపు క్లారిటీ రానుంది. పట్టణ శివారులోని బాలయోగి గురుకుల పాఠశాలలో కౌంటింగ్ జరగబోతుంది. 281 పోలింగ్ కేంద్రాలకు ఒకే చోట కౌంటింగ్ ఏర్పాట్లు చేశారు అధికారులు. ఈ ఎన్నకల్లో టీడీపీ, జనసేన పోటీలో లేకపోవడంతో రెండు పార్టీల ఓట్లు తమకే పడతాయని, బీజేపీ భావించింది. కానీ, వైసీపీకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.