Mansas Trust : జీతాలు అడిగితే కేసులు పెట్టడం దారుణం – అశోక్ గజపతిరాజు

మాన్సాస్ ట్రస్ట్ ఈఓపై, చైర్మన్ అశోక్ గజపతి రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాన్సాస్ సిబ్బంది జీతాలు అడిగితే పోలీస్ కేసులు పెట్టడం దారుణమని అన్నారు. ట్రస్ట్ ఈఓ జీతం తీసుకోకుండా పనిచేస్తున్నాడా అంటూ ప్రశ్నించారు అశోక్ గజపతి రాజు.

Mansas Trust : జీతాలు అడిగితే కేసులు పెట్టడం దారుణం – అశోక్ గజపతిరాజు

Mansas Trust

Updated On : July 21, 2021 / 5:04 PM IST

Mansas Trust : మాన్సాస్ ట్రస్ట్ ఈఓపై, చైర్మన్ అశోక్ గజపతిరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాన్సాస్ సిబ్బంది జీతాలు అడిగితే పోలీస్ కేసులు పెట్టడం దారుణమని అన్నారు. ట్రస్ట్ ఈఓ జీతం తీసుకోకుండా పనిచేస్తున్నాడా అంటూ ప్రశ్నించారు అశోక్ గజపతిరాజు.

సిబ్బంది జీతాలు అడగడంలో తప్పేంటని నిలదీశారు. విద్యాసౌకర్యాలు కల్పించేందుకు తమ పూర్వికులు ట్రస్ట్ పెడితే ప్రస్తుత ఈఓ మాత్రం దానికి విరుద్దంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. ఈఓపై కోర్టు ధిక్కరణ కేసు వేస్తున్నట్లు తెలిపారు.

కాగా రెండు రోజుల క్రితం మాన్సాస్ ట్రస్ట్ ఉద్యోగులు జీతాలకోసం ట్రస్ట్ కార్యాలయాన్ని ఒక్కసారిగా ముట్టడించారు. ట్రస్ట్ కార్యాలయంలో ఉన్న ఈఓ వెంకటేశ్వర్ ని చుట్టుముట్టారు. అయితే ఉద్యోగులు ఈ విధంగా ప్రవర్తించడాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకోని ఉద్యోగులపై కేసులు నమోదు చేశారు.

ఈఓ విధులకు ఆటంకం కల్పించడంతోపాటు కోవిడ్ నిబంధనలు ఉల్లగించారంటూ మాన్సాస్ ట్రస్ట్ ఉద్యోగులపై కేసులు నమోదు చేశారు. ఇక ఈ నేపథ్యంలోనే ట్రస్ట్ చైర్మన్ అశోక్ గజపతిరాజు ఈ రోజు మీడియాతో మాట్లాడారు.