GVL Narsimharao: అవినీతిపై అమిత్ షా చేసిన వ్యాఖ్యల్లో నిజంలేకపోతే వాటిపై సీబీఐ ఎంక్వయిరీ కోరండి..

సీఎం జగన్ మాకు బీజేపీ అండగా ఉండకపోవచ్చు అంటూ వ్యాఖ్యానించారు. బీజేపీ మీకు అండగా ఉండదు. అలాఅని ఎవ్వరికి అండగా బీజేపీ ఉండదు. మేము ప్రధాన ప్రతిపక్షంగా ఎదుగుతామని జీవీఎల్ చెప్పారు.

GVL Narsimharao: అవినీతిపై అమిత్ షా చేసిన వ్యాఖ్యల్లో నిజంలేకపోతే వాటిపై సీబీఐ ఎంక్వయిరీ కోరండి..

GVL Narsimharao

GVL Narsimharao: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఏపీ ప్రభుత్వం అవినీతిపై చేసిన వ్యాఖ్యల్లో నిజంలేకపోతే వాటిపై సీబీఐ ఎంక్వయిరీ కోరాలని రాజ్యసభ సభ్యులు, బీజేపీ నేత జీవీఎల్ నర్సింహారావు వైసీపీ నేతలకు సూచించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా రాజకీయ వేట ప్రారంభమైందని అన్నారు. విశాఖ‌లో అమిత్ షా సభ దిగ్విజయం అయింది. ఆ సభలో ఏపీకి కేంద్రం ఏం చేసిందో చెప్పామని జీవీఎల్ అన్నారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఏం ఇచ్చారని విష ప్రచారాలు చేస్తున్నారని, అందుకే ‘రాష్ట్ర ప్రభుత్వాల అసత్య ప్రచారాలు – కేంద్ర సహయం’ పేరుతో బుక్ ముద్రించామని జీవీఎల్ అన్నారు. దీనిని ఇంటింటికి తీసుకెళ్లి కేంద్రం అందిస్తున్న సహాయ సహకారాలు వారికి  తెలియజేస్తామని చెప్పారు.

Amit Shah: వైఎస్ జగన్ ప్రభుత్వం సిగ్గుపడాలి: అమిత్ షా తీవ్ర విమర్శలు

వైసీసీ నాయకులు కేంద్రం ఏం చేసింది అంటున్నారు. ఏం చేసిందో పూర్తిగా తెలుసుకోండి. లేదంటే అబాసుపాలవుతారు. కేంద్రం చేసిన సహాయంపై పుస్తకాలు పంపిస్తాం. చదువుకొని చర్చకు రండి. మేము ఎప్పుడూ చర్చకు సిద్ధమేనని జీవీఎల్ వైసీపీ ప్రభుత్వానికి సూచించారు. విశాఖలో భూ కుంభకోణాలు పెరిగిపోయాయి. భూకబ్జా దారులకు సీఎం జగన్ మోహన్ రెడ్డి కొమ్ముకాస్తున్నారు. రెండు ప్రభుత్వాలు భూ కుంభకోణం‌పై సిట్‌ వేసి బయట పెట్టలేదని విమర్శించారు. భూ కబ్జాలో మీ వాటాలు ఎంతో చెప్పాలంటూ జీవీఎల్ ప్రశ్నించారు. ఎన్నికల్లో ఇదే ఎజెండా‌గా బీజేపీ ప్రజల్లోకి వెళ్తుందని చెప్పారు.

Amit Shah : టార్గెట్ తెలంగాణ.. 15న ఖమ్మంకు అమిత్ షా, టూర్ షెడ్యూల్ ఇలా..

సీఎం జగన్ మాకు బీజేపీ అండగా ఉండకపోవచ్చు అంటూ వ్యాఖ్యానించారని, బీజేపీ మీకు అండగా ఉండదని జీవీఎల్ స్పష్టం చేశారు. అలాఅని ఎవ్వరికి అండగా బీజేపీ ఉండదని, మేము ప్రధాన ప్రతిపక్షంగా ఎదుగుతామని జీవీఎల్ చెప్పారు. ప్రతిపక్షాలుసైతం అసత్య ప్రచారాలు చేస్తున్నాయని, మానుకోవాలని సూచించారు. అవినీతిపై అమిత్ షా వాఖ్యల్లో నిజంలేకపోతే వాటిపై సీబీఐ ఎంక్వయిరీ వెయ్యాలని కోరాలని, తద్వారా నిజాయితీని నిరూపించుకోవాలని వైసీపీ నేతలకు జీవీఎల్ సూచించారు.