Amit Shah: వైఎస్ జగన్ ప్రభుత్వం సిగ్గుపడాలి: అమిత్ షా తీవ్ర విమర్శలు

అల్లూరి సీతారామరాజు, తెన్నేటి విశ్వనాథాన్ని స్మరిస్తూ ప్రసంగం ప్రారంభించారు అమిత్ షా.

Amit Shah: వైఎస్ జగన్ ప్రభుత్వం సిగ్గుపడాలి: అమిత్ షా తీవ్ర విమర్శలు

Amit Shah

Amit Shah – BJP: దేశం మొత్తంలో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రం రైతుల ఆత్మహత్యల్లో మూడో స్థానంలో ఉందని, రైతుల ప్రభుత్వం అని చెప్పుకునే సీఎం వైఎస్ జగన్ (YS Jagan) సర్కారు సిగ్గుపడాలని కేంద్ర మంత్రి అమిత్ షా తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీ పాలనకు తొమ్మిదేళ్లు పూర్తయిన వేళ విశాఖ(Vizag)లో బీజేపీ నిర్వహించిన సభలో అమిత్ షా మాట్లాడారు.

అల్లూరి సీతారామరాజు, తెన్నేటి విశ్వనాథాన్ని స్మరిస్తూ ప్రసంగం ప్రారంభించారు అమిత్ షా. పదేళ్ల యూపీఏ పాలనలో 12 లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పారు. మోదీ తొమ్మిదేళ్ల పాలనలో ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేదని అన్నారు. ఏపీలో జగన్‌ నాలుగేళ్ల పాలనలో అవినీతి తప్ప మరేమీ లేదని అన్నారు.

ఏపీలో పేదలకు పంచుతున్న బియ్యం మోదీ ఇచ్చినవేనని అమిత్ షా అన్నారు. కేంద్రం బియ్యం ఇస్తుంటే తామే ఇస్తున్నట్లు సీఎం జగన్‌ ఫొటో వేసుకుంటున్నారని అమిత్ షా ఎద్దేవా చేశారు. విశాఖలో వైసీపీ నేతలు భూ కుంభకోణాలకు పాల్పడుతున్నారని చెప్పారు.

కేంద్ర సర్కారు ఏపీకి ఇచ్చిన డబ్బాంతా ఎక్కడికి పోయిందని నిలదీశారు. సాగరమాల పథకం కింద అదనంగా కేంద్ర ప్రభుత్వం రూ.85 వేల కోట్లు ఇచ్చిందని తెలిపారు. మోదీ ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. తాము పుల్వామా ఘటన జరిగిన 10 రోజుల్లోనే ప్రతీకారం తీసుకున్నామని అన్నారు. సర్జికల్ స్ట్రైక్‌తో పాక్‌కు బుద్ధిచెప్పామని తెలిపారు.

Kiran Kumar Reddy: అందుకే ఇన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉన్నా: మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి