AP Politics : బొత్సలో కొత్త టెన్షన్..అందుకే అలర్ట్ అయ్యారా? Botsa Satyanarayana suffering from tension

AP Politics : బొత్సలో కొత్త టెన్షన్..అందుకే అలర్ట్ అయ్యారా?

విజయనగరం జిల్లా రాజకీయాల్లో తాను కార్నర్ అవుతున్నాననో..లేదా మేనల్లుడు తనని దాటి వెళ్లిపోతున్నాడన్న భయమో గానీ..బొత్సతన పంథా మార్చుకున్నారు. ఇకపై.. జిల్లాలో అన్నీ తన కనుసన్నల్లోనే జరగాలని.. ప్రతి విషయం తనకు తెలిసి తీరాలంటున్నారట.

AP Politics : బొత్సలో కొత్త టెన్షన్..అందుకే అలర్ట్ అయ్యారా?

AP Politics : విజయనగరం జిల్లా రాజకీయాల్లో తాను కార్నర్ అవుతున్నాననే భావనో.. మేనల్లుడు తనని దాటి వెళ్లిపోతున్నాడన్న భయమో తెలియదు గానీ.. ఆ సీనియర్ లీడర్ ఒక్కసారిగా తన పంథా మార్చుకున్నారు. ఇకపై.. జిల్లాలో అన్నీ తన కనుసన్నల్లోనే జరగాలని.. ప్రతి విషయం తనకు తెలిసి తీరాలంటున్నారట. ఫైనల్ డెసిషన్ కూడా తనదేనని చెప్పేశారు. ఇన్నాళ్లూ.. స్టేట్ పాలిటిక్స్‌లో బిజీగా ఉంటూ.. జిల్లా రాజకీయాలను పట్టించుకోని ఆ నేత.. ఉన్నట్టుండి యూటర్న్ తీసుకోవడానికి.. ఈ సీజనేంటి? దాని వెనకున్న రీజనేంటి?

విజయనగరం జిల్లా రాజకీయాలు.. ఫుల్ గరం మీదున్నాయ్. బహుశా ఎండల ఎఫెక్ట్ అయ్యుండొచ్చని అనుకున్నా.. కారణం వేరే అని తేలింది. కొన్నేళ్లలో.. ఎన్నడూ లేని విధంగా.. జిల్లా రాజకీయాల్లో దూకుడు పెంచారు మంత్రి బొత్స. ఇప్పుడు.. ప్రతి విషయాన్ని పట్టించుకుంటున్నారనే చర్చ మొదలైంది. అంటే.. ఇంతకుముందు పట్టించుకునే వారు కాదా? అంటే.. ఇంత గట్టిగా కాదనే టాక్ ఉంది. ఏం చేసినా.. తనకి తెలిసే చేయాలంటూ.. జిల్లా నేతలకు, కార్యకర్తలకు హుకుం జారీ చేశారని.. జిల్లా పార్టీ వర్గాల్లో అనుకుంటున్నారు. అంతేకాదు.. తనకి వ్యతిరేకంగా పనిచేస్తున్న ఓ వర్గంపైనా.. స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. సొంత కుటుంబం నుంచే.. కొందరు తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారన్న అనుమానం రావడంతోనే.. బొత్స అలర్ట్ అయ్యారన్న టాక్ వినిపిస్తోంది. దీంతో.. కొన్నాళ్లుగా జిల్లా రాజకీయాలపై ఫోకస్ పెంచినట్లు కార్యకర్తలు చెప్పుకుంటున్నారు.

Also read : Telangana : టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు..ఎంపీ, ఎమ్మెల్సీలతో టెన్షన్..అసలు విషయం ఏమిటంటే..

ఈ మధ్యకాలంలో.. రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు, జిల్లా పార్టీ పదవులు, మంత్రివర్గ విస్తరణలో శాఖ మార్పు లాంటి పరిణామాలతో.. ఏదో తేడా కొడుతోందన్న అభద్రతాభావం బొత్సలో మొదలైందన్న గుసగుసలు వినిపిస్తున్నాయ్. ఇందుకు.. ఆయన మేనల్లుడు చిన్న శ్రీనే కారణమని.. ఊరంతా అనుకుంటున్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక.. జిల్లా రాజకీయాల్లో బొత్స ప్రమేయం తగ్గింది. ఇదే టైంలో.. జిల్లా పార్టీలో చురుగ్గా ఉన్న.. మేనల్లుడు శ్రీను గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. సీఎం జగన్ అండ కూడా పుష్కలంగా ఉండటంతో.. వైసీపీలో తిరుగులేని నేతగా ఎదిగారు. దీనికి తోడు.. జెడ్పీ ఛైర్మన్ పదవి కూడా దక్కడంతో.. జిల్లా పాలిటిక్స్‌ని.. ఓ ఆటాడిస్తున్నారనే చర్చ జరుగుతోంది. కొత్తగా.. వైసీపీ జిల్లా అధ్యక్ష పదవి కూడా రావడంతో.. అంతా తానై వ్యవహరిస్తున్నారు. మెజారిటీ ఎమ్మెల్యేలు, నాయకులు, కేడర్ అంతా.. తన చుట్టే తిరిగేలా.. బలాన్ని, బలగాన్ని కూడా పెంచుకున్నారు.

బొత్సను మరిపించేలా.. చిన్న శ్రీను చక్రం తిప్పుతుండటంతో.. బొత్స వర్గం అభద్రతకు గురవుతోందన్న చర్చ పార్టీలో సాగుతోంది. ఇప్పటికే.. మంత్రివర్గ విస్తరణలో అంతగా ప్రాధాన్యం లేని శాఖ కేటాయించారని బొత్స ఫీలవుతున్నారనే టాక్ స్థానికంగా వినిపిస్తోంది. ఇప్పుడివన్నీ చూసి.. జిల్లాలో ఆయన ప్రభావం తగ్గిపోతుందేమోనన్న టెన్షన్‌లో ఉన్నారని చెప్పుకుంటున్నారు. ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కి.. మునుపటి హవాను కొనసాగించేందుకు ఆయన స్టైల్ మార్చారు. తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వర్గానికి చెక్ పెట్టేందుకు.. మళ్లీ జిల్లా రాజకీయాల్లో.. యాక్టివ్‌ అయ్యేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది.

Also read : Kerala : గర్ల్స్ స్కూల్లో ఘోరం..60 మంది విద్యార్థినులపై ఉపాధ్యాయుడు లైంగికంగా వేధింపులు

ఇటీవల జరిగిన వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలోనూ.. జిల్లా కో-ఆర్డినేటర్ హోదాలో పాల్గొన్నారు బొత్స. ఇదే.. వేదికపై నుంచి కొందరు ఎమ్మెల్యేలకు చురకలు అంటించారు. ఎవరూ ఒంటెద్దు పోకడలకు పోవద్దని స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చారు. కొందరు ఎమ్మెల్యేలు.. బొత్స ముందే చిన్న శ్రీనుని పొగడటం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారాలన్నింటిని చూస్తున్న బొత్స.. ఇకపై జిల్లా రాజకీయాల్లో దూకుడు పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. జిల్లా పార్టీలో జరిగే ప్రతి విషయం తన దృష్టికి వచ్చేలా.. జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఇక.. సొంత నియోజకవర్గం చీపురుపల్లితో పాటు మిగిలిన ప్రాంతాల్లో కేడర్‌కు దగ్గరయ్యేందుకు.. తరచుగా జిల్లా పర్యటనలు చేస్తారని సమాచారం. మళ్లీ.. జిల్లా రాజకీయాలను తన గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు.. బొత్స చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయన్నది.. ఇప్పుడు ఆసక్తిగా మారింది.

×