Power Dues : 30 రోజుల్లో ఏపీకి బకాయిలు చెల్లించండి.. తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం ఆదేశం

ఏపీకి విద్యుత్ బకాయిలు చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. 30 రోజుల్లో విద్యుత్ బకాయిలు చెల్లించాలని సూచించింది. విభజన తర్వాత తెలంగాణ డిస్కమ్ లకు విద్యుత్ సరఫరా చేసినందుకు ఏపీకి ప్రిన్సిపల్ అమౌంట్ రూ.3వేల 441 కోట్లు, లేట్ పేమెంట్ సర్ చార్జీలు రూ.3వేల 315 కోట్లు చెల్లించాలని తెలంగాణను ఆదేశించింది కేంద్రం.

Power Dues : 30 రోజుల్లో ఏపీకి బకాయిలు చెల్లించండి.. తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం ఆదేశం

Power Dues : ఏపీకి విద్యుత్ బకాయిలు చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. 30 రోజుల్లో విద్యుత్ బకాయిలు చెల్లించాలని సూచించింది. విభజన తర్వాత తెలంగాణ డిస్కమ్ లకు విద్యుత్ సరఫరా చేసినందుకు ఏపీకి ప్రిన్సిపల్ అమౌంట్ రూ.3వేల 441 కోట్లు, లేట్ పేమెంట్ సర్ చార్జీలు రూ.3వేల 315 కోట్లు చెల్లించాలని తెలంగాణను ఆదేశించింది కేంద్రం.

ఇటీవల ఏపీ సీఎం జగన్..ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఈ సమయంలో కూడా విద్యుత్ బకాయిల అంశంపై ప్రధాని మోదీతో చర్చించారు. అంతేకాదు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రితోనూ జగన్ ఈ విషయమై చర్చించారు. విభజన సమస్యలను కూడా పరిష్కరించాలని ప్రధానితో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసి కోరారు సీఎం జగన్.

విభజన సమస్యలు పరిష్కరించే విషయమై కేంద్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. గత వారం ఈ కమిటీ ఢిల్లీలో సమావేశం అయ్యింది. 2014 జూన్ 2 నుండి 2017 జూన్ 10వ తేదీ వరకు తెలంగాణకు విద్యుత్ సరఫరా చేసినందుకు డబ్బులు చెల్లించలేదని ఏపీ ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేసింది.

దీంతో విద్యుత్ సరఫరాకు సంబంధించి రూ.3వేల 441 కోట్ల 78లక్షలు చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించింది. అంతేకాదు సకాలంలో ఈ బిల్లులు చెల్లించనందుకు గాను లేట్ ఫీజు కింద అదనంగా డబ్బులు చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది కేంద్రం.