Karumuri Nageswara Rao : ఏ క్షణమైనా చంద్రబాబు అరెస్ట్- మంత్రి సంచలన వ్యాఖ్యలు

Karumuri Nageswara Rao : ఎన్టీఆర్ కి భారతరత్న ఇస్తే లక్ష్మీపార్వతి అందుకుంటుందని చంద్రబాబు ఏనాడు అడగలేదు. ఎన్టీఆర్ బతికునప్పుడు వెన్నుపోటు పొడిచారు. చనిపోయిన తర్వాత కూడా చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తున్నారు.

Karumuri Nageswara Rao : ఏ క్షణమైనా చంద్రబాబు అరెస్ట్- మంత్రి సంచలన వ్యాఖ్యలు

Karumuri Nageswara Rao (Photo : Google)

Updated On : May 22, 2023 / 7:21 PM IST

Karumuri Nageswara Rao-Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏ క్షణమైనా అరెస్ట్ అవుతారని, జైలుకి వెళ్లడం ఖాయం అని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అవుతారని ఆయన చెప్పారు. చంద్రబాబు తీరుపై మంత్రి విరుచుకుపడ్డారు. రైతు పోరుబాటలో చంద్రబాబు పచ్చి అబద్దాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు రైతు పోరుబాటలో రైతులు లేరు, లోకేశ్ యువగళంలో యువత లేరని మంత్రి కారుమూరి ఎద్దేవా చేశారు. విమర్శలు మాని సీఎం జగన్ చేస్తున్న అభివృద్ధిని చంద్రబాబు అభినందించాలన్నారు.

” కరోనా సమయంలో చంద్రబాబు సహా ప్రతిపక్ష పార్టీల నేతలు కలుగలో ఎలుకల మాదిరిగా దాక్కొన్నారు. సీఎం జగన్ ధైర్యంగా కరోనాను ఎదుర్కొన్నారు. వాలంటీర్ వ్యవస్థ జగన్ కు కొండంత ధైర్యంగా ఉంది. వాలంటీర్ వ్యవస్థ మీద చంద్రబాబు అక్కసు వెళ్లగక్కుతూనే ఉన్నారు. గోదావరి జిల్లా పర్యటనలో చంద్రబాబు పచ్చి అబద్దాలు మాట్లాడారు. ఇరగవరంకు చెందిన వ్యక్తి హైదరాబాద్ నుండి వచ్చి జగన్ చేసిన మేలు గురించి చెప్పారు.

Also Read..Perni Nani : రాజకీయాల నుంచి రిటైర్ అవుతున్నా : సీఎం జగన్ సమక్షంలో పేర్ని నాని సంచలన ప్రకటన

తడిసిన ధాన్యంతో పాటు మొలకలు వచ్చిన ధాన్యం కొనుగోలు చేశారని రైతులే చెబుతున్నారు. చంద్రబాబు వచ్చి డ్రామాలు ఆడడం తప్ప ఏమీ చేయలేదు. బీసీ మంత్రికి తద్దినాలు పెడతాం అన్నారు. పెద్ద కర్మలు పెడతాం అన్నారు. బీసీలు అంటే చంద్రబాబుకి ద్వేషం. చంద్రబాబును చూస్తే ప్రేతకళ వచ్చేస్తుంది. చంద్రబాబు రాక్షసుడు, సైకో. సెంటు భూమి సమాధులు కట్టడానికి అంటున్నారు.

ఎన్టీఆర్ కి భారతరత్న ఇస్తే లక్ష్మీపార్వతి అందుకుంటుందని చంద్రబాబు ఏనాడు అడగలేదు. ఎన్టీఆర్ బతికున్నప్పుడు వెన్నుపోటు పొడిచారు. చనిపోయిన తర్వాత కూడా చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తున్నారు. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని జగన్ కేంద్రాన్ని కోరతారు. ఇకనైనా చంద్రబాబు బుద్ధి తెచ్చుకోవాలి. జగన్ చేస్తున్న అభివృద్ధిని అభినందించాలి. లోకేశ్ కోసమే జూనియర్ ఎన్టీఆర్ ని చంద్రబాబు తొక్కి పెడుతున్నారు. పప్పుని పైకి తేవాలనేది చంద్రబాబు తాపత్రయం” అని మంత్రి కారుమూరి అన్నారు.