Chandrababu : గ్రీజు కూడా వేయలేని ముఖ్యమంత్రి, మూడు రాజధానులు కడతాడా? చంద్రబాబు

గేటుకు గ్రీజు వేయించలేని ముఖ్యమంత్రి.. మూడు రాజధానులు కడతాడా? గేటుకి రిపేర్ వస్తే ఏడాది అయినా చేయలేదు. ప్రభుత్వ తప్పిదం వల్లే వరదల్లో 62మంది..

Chandrababu : గ్రీజు కూడా వేయలేని ముఖ్యమంత్రి, మూడు రాజధానులు కడతాడా? చంద్రబాబు

Chandrababu

Chandrababu : ఏపీ సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. అన్నమయ్య ప్రాజెక్టు గేటుకు గ్రీజు వేయించలేని ముఖ్యమంత్రి.. మూడు రాజధానులు కడతాడా? అంటూ ఎద్దేవా చేశారు. గేటుకి రిపేర్ వస్తే ఏడాది అయినా చేయలేదని మండిపడ్డారు. ప్రభుత్వ తప్పిదం వల్లే వరదల్లో 62మంది మరణించారని చంద్రబాబు వాపోయారు. ప్రజల మరణాలకు కారకుడైన జగన్ ముఖ్యమంత్రిగా దిగిపోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వర్షాలు, వరదల ధాటికి రూ.6వేల కోట్ల పంట, ఆస్తి నష్టం సంభవించిందన్నారు. ప్రాణాలకు రక్షణ కాదు, మృతదేహం కూడా ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వమిది అని చంద్రబాబు ఫైర్ అయ్యారు.

రాష్ట్రంలో వరదలతో ప్రజలు జీవన్మరణ సమస్యను ఎదుర్కొంటుంటే ఆయన అసెంబ్లీలో తన ముఖం చూడాలని అన్నారని, అదే సమయంలో సిగ్గు లేకుండా పెళ్లికి పోయారని మండిపడ్డారు. అన్నమయ్య గేట్లు మొత్తం కొట్టుకుపోయాయని, ఆ గేటు సమస్య ఇప్పుడు వచ్చింది కాదని తెలిపారు.

Android apps : స్మార్ట్ ఫోన్ యూజర్లకు హెచ్చరిక.. ఈ యాప్స్ యమ డేంజర్.. బ్యాంకు ఖాతాలు ఖాళీ

కడపలోని అన్నమయ్య ప్రాజెక్టు వైఫల్యంపై చంద్రబాబు మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వానికి జవాబుదారీతనం లేదని విమర్శలు చేశారు. ప్రజలు తెలిసో తెలియకో ఓట్లేసిన పాపానికి వారి ప్రాణాలు తీస్తారా? అంటూ ఆగ్రహించారు. వర్షాలు పడి రెండుసార్లు వరదలు రావడంతో ప్రాజెక్టులన్నీ నిండిపోయాయని, మళ్లీ వరద వస్తుందని వాతావారణ శాఖ ముందే హెచ్చరించినా ప్రభుత్వం స్పందించలేదని చంద్రబాబు అన్నారు. విపత్తుకు బాధ్యులైన వారందరినీ శిక్షించాలని చెప్పారు. జగన్ ప్రభుత్వ వైఫల్యం వల్లే ప్రాణ నష్టం జరిగిందన్నారు.

అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు మొత్తం కొట్టుకుపోయాయని, వాటికి మరమ్మతులు చేయించలేదని చంద్రబాబాబు ఆరోపించారు. గతంలో వరదలు వచ్చినప్పుడు అన్నమయ్య ప్రాజెక్ట గేటు క్లోజ్ కాలేదని, నీరు వృథాగా పోయిందని తెలిపారు. ఈసారి వరదలకు అదే గేట్ ఓపెన్ కాలేదని చెప్పారు. గేట్ సమస్య అప్పటికప్పుడు వచ్చింది కాదని, ఇసుక కోసం నదిలోకి వెళ్లిన టిప్పర్ల కోసమే నీటిని విడుల చేయలేదని ఆరోపించారు.

”తెలిసో.. తెలియకో ఓట్లేస్తే ప్రభుత్వం చేసే పని ఇదేనా? ముందస్తుగా వాతావరణశాఖ అధికారులు హెచ్చరికలు చేసినా సీఎం పట్టించుకోరా? హెచ్చరిక చేసిన తర్వాత కూడా ఉదాసీనంగా ఉండడం వల్లే ప్రాణాలు పోయాయి. ముమ్మాటికీ ఇవి ప్రభుత్వ హత్యలే. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 6వేల కోట్ల పంట, ఆస్తి నష్టం జరిగింది. వరదలు వచ్చిన సమయంలో అధికారులు, మంత్రులు ఏమయ్యారు?” అని చంద్రబాబు ప్రశ్నించారు.

WhatsApp New Feature : పొరపాటున వాట్సాప్ స్టేటస్ పెట్టారా? క్షణాల్లో డిలీట్ చేయొచ్చు!

”అన్నమయ్య ప్రాజెక్టు విషయంలో గతేడాది వరదలు వచ్చినప్పుడు కూడా ఐదో గేటు పని చేయలేదు. అప్పట్లో ఐదో గేటు పని చేయకుండానే మిగిలిన గేట్ల నుంచి నీళ్లు వెళ్లిపోయాయి. ఇప్పుడు వచ్చిన వరదలకు కూడా ఐదో గేట్ పని చేయలేదు. గతేడాది మూడు గేట్లు పని చేయకుంటే రెండు గేట్లని రిపేర్ చేయించి.. ఓ గేట్ వదిలేశారు. దీని కారణంగానే అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది. తమను ఎవ్వరూ హెచ్చరించ లేదని బాధితులు నాతో చెప్పారు. ఒకే కుటుంబంలో 9 మంది చనిపోయారు. గత నెల 19వ తేదీన వరద వచ్చి ప్రాజెక్టు కొట్టుకుపోతే.. కుప్పంలో ఓడిపోయాం కాబట్టి.. సీఎం జగన్ అసెంబ్లీలో నా మొహం చూడాలంటారా..? ప్రజలు కష్టాల పాలవుతున్నా పట్టించుకోకుండా సీఎం పైశాచికానందం పొందారు” అని చంద్రబాబు మండిపడ్డారు.