SP Rishant Reddy : పేపర్‌ లీకేజ్‌ చైన్ ను నారాయణే లీడ్ చేస్తున్నారు : ఎస్పీ రిషాంత్‌రెడ్డి

పేపర్‌ లీకేజ్‌ చైన్ నారాయణే లీడ్ చేస్తున్నారని తెలిపారు. విచారణలో ఆధారాలు దొరికినందుకే నారాయణను అరెస్ట్ చేశామని చెప్పారు. ఈ కేసులో ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.

SP Rishant Reddy : పేపర్‌ లీకేజ్‌ చైన్ ను నారాయణే లీడ్ చేస్తున్నారు : ఎస్పీ రిషాంత్‌రెడ్డి

Sp Rishanth Reddy

SP Rishant Reddy : టీడీపీ నేత, మాజీ మంత్రి, నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణను ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసింది. నారాయణ అరెస్టును చిత్తూరు పోలీసులు ధృవీకరించారు. టెన్త్ ఎగ్జామ్స్ మాల్ ప్రాక్టీస్ కేసులో ఆయన్ను అరెస్టు చేసినట్లు ఎస్పీ కార్యాలయం తెలిపింది. ఉదయాన్నే హైదరాబాద్ లో నారాయణను చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు నారాయణను హైదరాబాద్ నుంచి చిత్తూరు తీసుకెళ్తున్నారు. ప్రశ్నపత్రాల మాల్ ప్రాక్టీస్ కేసులో ఇప్పటికే 60 మందిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.

నారాయణ అరెస్టుకు సంబంధించిన వివరాలను చిత్తూరు జిల్లా ఎస్పీ రిషాంత్‌రెడ్డి వీడియాకు వివరించారు. పేపర్‌ లీకేజ్‌ చైన్ నారాయణే లీడ్ చేస్తున్నారని తెలిపారు. విచారణలో ఆధారాలు దొరికినందుకే నారాయణను అరెస్ట్ చేశామని చెప్పారు. ఈ కేసులో ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. పేపర్ లీకేజీ కేసులో మూలాలన్నీ నారాయణ వైపే చూపిస్తున్నాయని పేర్కొన్నారు. నారాయణ విద్యాసంస్థల్లో బాగా చదివేవాళ్లను ఓ సెక్షన్.. చదవని వాళ్లను మరో సెక్షన్ పెడతారని వెల్లడించారు.

Sajjala : నారాయణ అరెస్టుపై సజ్జల సంచలన వ్యాఖ్యలు

చదవని విద్యార్ధుల కోసం పేపర్ లీక్ చేస్తున్నారని తెలిపారు. ఈ కేసులో ఏడుగురిని అరెస్ట్‌ చేశామని చెప్పారు. అడ్మిషన్లు పెంచుకోవడం కోసమే పేపర్‌ లీక్‌ చేస్తున్నారని తెలిపారు. కొన్నేళ్లుగా ఈ లీక్ వ్యవహారం నడుస్తోందన్నారు. ఇన్విజిలేటర్లను లోబర్చుకుని పేపర్‌ లీకేజీకి పాల్పడ్డారని పేర్కొన్నారు. కార్పొరేట్ స్కూల్ విద్యార్ధులకు మంచి మార్కులు రావాలని మాల్‌ ప్రాక్టీస్ కుట్ర చేశారని తెలిపారు. కార్పొరేట్ స్కూల్స్‌లో జీరో ఫెయిల్యూర్‌ ఉండాలన్నదే వాళ్ల లక్ష్యమన్నారు.

నారాయణను ఉదయం అరెస్ట్ చేశామని తెలిపారు. 27న పదవ తరగతి ప్రశ్నపత్రం లీక్ పై 7 మందిని అరెస్ట్ చేశామన్నారు. పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాతే అరెస్ట్ చేశామని చెప్పారు. అడ్మిషన్లు పెంచుకోవడం కోసం ఇది చేశారని పేర్కొన్నారు. సమాధానాల పత్రాలు లోపలికి పంపి విద్యార్థులకు ఇస్తారని చెప్పారు. ప్రశ్న పత్రాల మాల్ ప్రాక్టీసు చేశారు… గతంలోనూ ఇలా చేసినట్లు గుర్తించామని తెలిపారు.

Narayana Arrest : నారాయణ అరెస్టును ధృవీకరించిన చిత్తూరు పోలీసులు

నారాయణ సహకరించారని.. మిగతా విద్యాసంస్థలు ప్రమేయాన్ని పరిశీలించామని చెప్పారు. వారంతా ఇది వరకు నారాయణ సంస్థల్లో పని చేసిన వారేనని తెలిపారు. కొందరికి డబ్బులు ఇచ్చి ప్రశ్న పేపర్ లు సంపాదిస్తారని.. ఇది కుట్ర పూరితంగా జరిగిందన్నారు. నారాయణ భార్యను తాము అరెస్ట్ చేయలేదన్నారు. నారాయణ పాత్ర గురించి ఆధారాలు లభించాయని చెప్పారు.