CM Jagan : ఏపీలో కరోనా కట్టడికి సీఎం జగన్ యాక్షన్ ప్లాన్

ఏపీలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. కోవిడ్ -19 నియంత్రణకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.

CM Jagan : ఏపీలో కరోనా కట్టడికి సీఎం జగన్ యాక్షన్ ప్లాన్

Cm Jagan Action Plan For Corona Control In Ap

CM Jagan Action Plan for Corona Control : ఏపీలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. కోవిడ్ -19 నియంత్రణకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. దీంతో అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. ఇప్పటికే సీఎం జగన్ రాష్ట్రంలో పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. సోమవారం మరోసారి ముఖ్యమంత్రితో అధికారులు భేటీ అయ్యే అవకాశం ఉంది. ఈ సమావేశంలో రాష్ట్రంలో ఆంక్షలు, చికిత్సపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విలయం సృష్టిస్తోంది. రోజురోజుకు కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన మూడు రోజుల్లో నాలుగు వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజులోనే ఆరు వేల 96 కేసులు నమోదవగా…20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎన్నడూ లేనంతగా వైరస్ విజృంభణతో జనం భయాందోళనకు గురవుతున్నారు.

పొరుగు రాష్ట్రం తెలంగాణలో ఇప్పటికే విద్యాసంస్థలను బంద్ చేశారు. మిగతా రాష్ట్రాల్లో రాత్రి కర్ఫ్యూ విధించారు. జన సంచారంపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. దీంతో ఏపీ ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. నేరుగా లాక్‌డౌన్ విధించకపోయినా కర్ఫ్యూ లాంటి కఠిన ఆంక్షలు విధించాలా అన్న దానిపై సోమవారం ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశముంది.