టీడీపీకి జగన్ కౌంటర్ : అంబానీతో భేటీ..అజెండా ఏంటీ

  • Published By: madhu ,Published On : February 29, 2020 / 01:37 PM IST
టీడీపీకి జగన్ కౌంటర్ : అంబానీతో భేటీ..అజెండా ఏంటీ

ఏపీ నుంచి పరిశ్రమలు వెళ్లిపోతున్నాయి…ఇప్పటికే ఎన్నో పరిశ్రమలు పోయాయి..అంటూ టీడీపీ ప్రచారం చేస్తోంది. అయితే..ఈ వాదనను వైసీపీ తిప్పికొట్టే ప్రయత్నం చేస్తోంది. కానీ అనూహ్యంగా ప్రముఖ వ్యాపార వేత్త, రిలయెన్స్ (Reliance) అధినేత ముకేశ్ అంబానీ ఏపీలో అడుగుపెట్టడం పొలిటికల్ హీట్ పెంచేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ – ముఖేశ్ అంబానీల భేటీ రాజకీయ వర్గాల్లో హాట్ హాట్ చర్చలు స్టార్ట్ అయ్యాయి.

తాడేపల్లిలోని సీఎం నివాసంలో 2020, ఫిబ్రవరి 29వ తేదీ శనివారం ఈ సమావేశం జరిగింది. ఈయన ఏపీకి వస్తారనే సంగతి గోప్యంగా ఉంచడం గమనార్హం. గన్నవరం ఎయిర్ పోర్టుకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వెళ్లడం..అక్కడ ముఖేశ్ అంబానీకి స్వాగతం పలకడం జరిగిపోయాయి.

అనంతరం నేరుగా సీఎం జగన్ నివాసానికి చేరుకున్నారు. అక్కడ వీరిద్దరూ సుమారు గంటా 40 నిమిషాల పాటు సమావేశమయ్యారు. అంతసేపు ఏం మాట్లాడుకున్నారు ? ఒప్పందాలు ఏమైనా జరిగాయా ? అనేది బయటకు పొక్కడం లేదు. కానీ ఈ సమావేశంపై రకరకాల వార్తలు వస్తున్నాయి. 

ప్రధానంగా ఏపీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని సీఎం జగన్ కోరుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అంబానీతి జరిగిన భేటీలో ఇదే విషయాన్ని ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఇటీవలే ఏపీ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలను ఆయనకు వివరించినట్లు సమాచారం. మూడు రాజధానులు, పరిపాలన వికేంద్రీరణతోనే అభివృద్ధి సాధ్యమని ముఖేశ్‌కు జగన్ వివరించినట్లు టాక్. ఏపీలో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి ముఖేశ్..జగన్ మధ్య జరిగిన సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. 

ఏపీలో అధికారంలోకి వైసీపీ రావడం..సీఎం జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ రాష్ట్రంలో పర్యటించడం తొలిసారి అని చెప్పవచ్చు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ప్రభుత్వంతో రిలయెన్స్ కంపెనీ పలు ఒప్పందాలు చేసుకుంది. బాబు ఇచ్చిన హామీలను జగన్ ప్రభుత్వం కూడా కంటిన్యూ చేస్తాయనే ప్రచారం జరిగింది.

విద్యుత్ ఉత్పాదక రంగంలో రిలయెన్స్ కంపెనీ చురుగ్గా పాల్గొంటోంది. ఏపీలో పలు చోట్ల చమురు వెలికితీత పనులు కూడా చేపడుతోంది. ప్రధానంగా KG Basinలో రిలయన్స్ గ్యాస్, చమురు నిక్షేపాలను వెలికితీస్తోంది రిలయెన్స్. అయితే..ఏపీకి కాకుండా..ఇతర రాష్ట్రాలకు రిలయెన్స్ పైప్ లైన్ ద్వారా తరలిస్తోంది. ఏపీకి కూడా వాటా ఇవ్వాలని దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి పట్టుబట్టారు. ప్రస్తుతం జగన్ – అంబానీల మధ్య జరిగిన భేటీలో ఈ అంశం చర్చకు వచ్చినట్లు సమాచారం. 

కీలకమైన అంశం…తిరుపతిలో రిలయెన్స్ సంస్థ నిర్మించతలపెట్టిన ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్షరింగ్ (రూ. 15 వేల కోట్లు అంచనా) హబ్ తరలిపోతుందని ఇటీవలే పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. త్వరలో ఏపీలో కొత్త పారిశ్రామిక విధానం అమల్లోకి రానున్న క్రమంలో..ఈ ప్రాజెక్టుపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. 

ముకేశ్ అంబానీతో పాటు ఆయన కుమారుడు అనంత్ అంబానీ, రాజ్యసభ సభ్యుడు పరిమళ్ నత్వానీ కూడా వచ్చారు. వీరికి జగన్ సాదారంగా స్వాగతం పలికారు. అనంతరం వీరికి శాలువాతో సత్కరించి..మెమెంటో అందచేశారు. పరిశ్రమలు పోతాయని అంటున్న టీడీపీకి గట్టి కౌంటర్ ఇచ్చేందుకు వైసీపీ నేతలు రెడీ అవుతున్నారు. కానీ..జగన్ – అంబానీ మధ్య జరిగిన భేటీలో ఎలాంటి అంశాలు చర్చించారనేది తెలియాలంటే..కొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు. 
Read More : మూడు రోజుల్లో ఉరి : నిర్భయ దోషుల నాటకాలు కంటిన్యూ