CM Jagan : అచ్యుతాపురం గ్యాస్‌ లీక్‌ఘటనపై సీఎం జగన్ ఆరా..అస్వస్థతకు గురైనవారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు

అస్వస్థతకు గురైన వారికి మంచి వైద్యాన్ని అందించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేసి, మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సంబంధిత శాఖ అధికారులకు సీఎం ఆదేశాలు జారీచేశారు.

CM Jagan : అచ్యుతాపురం గ్యాస్‌ లీక్‌ఘటనపై సీఎం జగన్ ఆరా..అస్వస్థతకు గురైనవారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు

Cm Jagan

CM Jagan inquire : అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో విషవాయువు లీక్ అయి పలువురు మహిళలు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. గ్యాస్‌ లీక్‌ఘటనపై సీఎం జగన్ ఆరా తీశారు. అచ్యుతాపురంలో అమ్మోనియా గ్యాస్‌ లీక్, బ్రాండెక్స్‌లో పనిచేస్తున్న మహిళలకు అస్వస్థత ఘటనపై అధికారుల నుంచి వివరాలు కోరారు. ఈ ఘటనకు దారితీసిన కారణాలను సీఎంఓ అధికారులు వివరించారు. సంబంధిత జిల్లా కలెక్టర్‌ వెంటనే అక్కడికి వెళ్లి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారని అధికారులు వెల్లడించారు.

గ్యాస్‌ లీక్‌ను కూడా నియంత్రించారని తెలిపారు. బ్రాండిక్స్‌లో ఒక యూనిట్‌లో పనిచేస్తున్న మహిళలను అందర్నీ ఖాళీ చేయించామని, అస్వస్థతకు గురైన వారిని ఆస్పత్రికి తరలించారని అధికారులు తెలిపారు. అస్వస్థతకు గురైన వారంతా కోలుకుంటున్నారని, క్షేమంగా ఉన్నారని వివరించారు. అమ్మోనియా ఎక్కడి నుంచి లీకైందన్న అంశంపై అధికారులు దర్యాప్తు చేపట్టారన్నారు.

Toxic Gases : అనకాపల్లి జిల్లాలో విషవాయువులు లీక్..పలువురు మహిళలకు తీవ్ర అస్వస్థత

అస్వస్థతకు గురైన వారికి మంచి వైద్యాన్ని అందించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేసి, మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సంబంధిత శాఖ అధికారులకు సీఎం ఆదేశాలు జారీచేశారు. ఘటనా స్థలానికి వెళ్లాల్సిందిగా స్థానిక మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ను సీఎం జగన్ ఆదేశించారు. వెంటనే మంత్రి గుడివాడ విజయవాడ నుంచి అనకాపల్లి బయల్దేరి వెళ్లారు.

అనకాపల్లి జిల్లాలో గ్యాస్ లీక్‌ కలకలం రేపుతోంది. అచ్యుతాపురం సెజ్‌లో విషవాయువు స్థానికులను ఊపిరాడకుండా చేస్తోంది. బ్రాండిక్స్ ఫ్యాక్టరీ నుంచి విషవాయువులు వెలువడ్డాయి. బ్రాండిక్స్ సెజ్‌లో ఉన్న సీడ్స్‌ యూనిట్ నుంచి గ్యాస్ లీక్ అయింది. దీంతో కంపెనీలో పనిచేస్తున్న నలుగురు మహిళలు.. అస్వస్థతకు గురయ్యారు. విషవాయువుల ప్రభావంతో.. స్థానికులు ఊపిరాడక ఆస్పత్రికి పరుగులు తీశారు. విషవాయులు లీక్ అవడంతో వాంతులు, తలనొప్పితో బాధితులు ఇబ్బంది పడుతున్నారు.