ఒక్కొక్కరి ఖాతాల్లో రూ.15వేలు, కాపు నేస్తం పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్

ఏపీ సీఎం జగన్ సంక్షేమ పథకాల అమల్లో దూసుకెళ్తున్నారు. కరోనా కారణంగా తలెత్తిన ఆర్థిక సంక్షోభ

ఒక్కొక్కరి ఖాతాల్లో రూ.15వేలు, కాపు నేస్తం పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్

ఏపీ సీఎం జగన్ సంక్షేమ పథకాల అమల్లో దూసుకెళ్తున్నారు. కరోనా కారణంగా తలెత్తిన ఆర్థిక సంక్షోభ

ఏపీ సీఎం జగన్ సంక్షేమ పథకాల అమల్లో దూసుకెళ్తున్నారు. కరోనా కారణంగా తలెత్తిన ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లోనూ సంక్షేమ పథకాలు ప్రారంభిస్తూ పేదలకు అండగా నిలుస్తున్నారు. ఇప్పటికే పలు స్కీమ్స్ ప్రారంభించి ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు ఆర్థిక సాయం అందించిన జగన్ ప్రభుత్వం, తాజాగా మహిళల కోసం మరో పథకాన్ని ప్రారంభించింది. కాపు మహిళల కోసం వైఎస్ఆర్ కాపు నేస్తం పథకాన్ని సీఎం జగన్ తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ లో బుధవారం(జూన్ 24,2020) ప్రారంభించారు. ఈ పథకం కింద అర్హులైన కాపు మహిళలకు ఒక్కొక్కరికి రూ.15వేలు ఆర్థిక సాయం అందించారు. అర్హులైన వారి బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా జమ చేశారు. తొలి ఏడాది రూ.354 కోట్ల ఖర్చుతో దాదాపు 2.36లక్షల మంది మహిళలకు లబ్ది చేకూర్చారు.

వివక్ష లేని, అవినీతి లేని పాలన:
13 నెలల కాలంలో ఎలాంటి వివక్ష లేకుండా పాలన సాగించామని సీఎం జగన్ చెప్పారు. ఎక్కడా అవినీతి లేకుండా పాలన చేస్తున్నామన్నారు. కుల, మత, ప్రాంత, రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. కాపు నేస్తం సహా వివిధ పథకాలకు రూ.4వేల 700 కోట్లు ఖర్చు పెట్టామన్నారు.

పేద కాపు మహిళలను ఆర్ధికంగా ఆదుకోవడానికి:
పేద కాపు మహిళలను ఆర్ధికంగా ఆదుకోవడానికి జగన్ ప్రభుత్వం వైఎస్ఆర్ కాపు నేస్తం స్కీమ్ తెచ్చింది. అర్హులైన పేద మహిళలకు ఈ పథకం ద్వారా సంవత్సరానికి రూ.15 వేలు చొప్పున ఐదేళ్లలో రూ.75 వేలు సాయం అందిస్తామని సీఎం జగన్ చెప్పిన సంగతి తెలిసిందే. కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు చెందిన 45 నుంచి 60 సంవత్సరాల మహిళలకు ఈ పథకం వర్తిస్తుంది.

అర్హతలు ఇవే:
* కుటుంబంలో ఎవరైనా ఆదాయ పన్ను చెల్లిస్తుంటే వారు అనర్హులు.
* గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.10 వేలు, పట్టణ ప్రాంతాల్లో నెలకు రూ.12వేలు ఆదాయం కలిగి ఉన్నవారు అర్హులు
* కుటుంబానికి 3 ఎకరాల్లోపు మాగాణి/ 10 ఎకరాల్లోపు మెట్ట భూమి లేదా రెండూ కలిపి 10 ఎకరాల్లోపు ఉండాలి
* 45-60 వయసు ఉన్న వారు అర్హులు
* కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి ఉన్నా, గవర్నమెంట్ పెన్షన్ తీసుకుంటున్నా అనర్హులు
* కుటుంబం నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండరాదు (ట్యాక్సీలు, ట్రాక్టర్లు, ఆటోలకు మినహాయింపు)
* ఎలాంటి ఆస్తి లేదా 750 చదరపు అడుగులకు మించిన ఇల్లు లేదా ఇతర ఏ నిర్మాణాలు కలిగి ఉండరాదు.

ఈ పథకం లబ్ధిదారుల ఎంపిక పూర్తి పారదర్శకంగా చేశామని అధికారులు తెలిపారు. సామాజిక తనిఖీ, ఆ తర్వాత గ్రామ, వార్డు వలంటీర్ల వ్యక్తిగత తనిఖీలు, గ్రామ సచివాలయాల్లో అర్హులైన లబ్ధిదారుల జాబితాల ప్రదర్శన, అభ్యంతరాల స్వీకరణ.. మళ్లీ సర్వే, తనిఖీలు.. ఇలా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేశారు.