YSR Matsakara Bharosa : సీఎం జగన్ గుడ్ న్యూస్, రేపు వారి ఖాతాల్లోకి రూ.10వేలు

కరోనా కష్టకాలంలోనూ, ఆర్థిక ఇబ్బందుల్లోనూ ఏపీ సీఎం జగన్ ఇచ్చిన మాటకు కట్టుబడి హామీలు అమలు చేస్తున్నారు. సంక్షేమ పథకాలు ఆగిపోకుండా చూస్తున్నారు. కష్టకాలంలో లబ్ధిదారులకు ఆర్థిక సాయం చేసి అండగా నిలుస్తున్నారు. ఇప్పటికే పలు సంక్షేమ పథకాలు అమలు చేసి లబ్దిదారులకు డబ్బులు ఇచ్చిన సీఎం జగన్ తాజాగా.. మత్స్యకార కుటుంబాలకు శుభవార్త చెప్పారు.

YSR Matsakara Bharosa : సీఎం జగన్ గుడ్ న్యూస్, రేపు వారి ఖాతాల్లోకి రూ.10వేలు

Ysr Matsakara Bharosa

YSR Matsakara Bharosa : కరోనా కష్టకాలంలోనూ, ఆర్థిక ఇబ్బందుల్లోనూ ఏపీ సీఎం జగన్ ఇచ్చిన మాటకు కట్టుబడి హామీలు అమలు చేస్తున్నారు. సంక్షేమ పథకాలు ఆగిపోకుండా చూస్తున్నారు. కష్టకాలంలో లబ్ధిదారులకు ఆర్థిక సాయం చేసి అండగా నిలుస్తున్నారు. ఇప్పటికే పలు సంక్షేమ పథకాలు అమలు చేసి లబ్దిదారులకు డబ్బులు ఇచ్చిన సీఎం జగన్ తాజాగా.. మత్స్యకార కుటుంబాలకు శుభవార్త చెప్పారు.

వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం కింద మత్స్యకారులకు వరుసగా మూడో ఏడాది రూ.10వేల చొప్పున చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా 1,19,875 కుటుంబాలకు ప్రభుత్వం రూ.130.46 కోట్లు విడుదల చేసింది. ఈ ఏడాది మొత్తం 1,19,875 మందిని అర్హులుగా గుర్తించారు. అందులో బీసీలు 1,18,119 మంది.. ఓసీలు 747 మంది, ఎస్సీలు 678మంది, ఎస్టీలు 331 మంది ఉన్నారు. రేపు( మే 18,2021) లబ్దిదారుల ఖాతాల్లో నగదు జమ కానుంది.

ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు సముద్రంలో వేట నిషేధించడం వల్ల మత్స్యకారులు ఉపాధి కోల్పోతున్నారు. దీంతో ఈ నిషేధ కాలానికి సంబంధించి ఒక్కో మత్స్యకార కుటుంబానికి రూ.10వేల చొప్పున వైఎస్ఆర్ మత్స్యకార భరోసా కింద ప్రభుత్వం డబ్బులు ఇస్తోంది. రేపు ఒక్కో లబ్దిదారుడి ఖాతాలో రూ.10వేలు జమ కానున్నాయి. వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం చెల్లింపులను సీఎం జగన్ రేపు ప్రారంభించనున్నారు.