CM Jagan’s Birthday : రేపు సీఎం జగన్ బర్త్ డే.. సాంస్కృతిక కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు ఏర్పాటు

సీఎం జగన్ బర్త్ డేను ఘనంగా జరిపేందుకు వైసీపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. డిసెంబర్ 21వ తేదీ సీఎం జగన్ పుట్టిన రోజు వేడుకల సందర్భంగా రకరకాల కార్యక్రమాలు నిర్వహించేందుకు వైసీపీ నేతలు శ్రీకారం చుట్టారు.

CM Jagan’s Birthday : రేపు సీఎం జగన్ బర్త్ డే.. సాంస్కృతిక కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు ఏర్పాటు

JAGAN

CM Jagan’s birthday : సీఎం జగన్ బర్త్ డేను ఘనంగా జరిపేందుకు వైసీపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. డిసెంబర్ 21వ తేదీ సీఎం జగన్ పుట్టిన రోజు వేడుకల సందర్భంగా రకరకాల కార్యక్రమాలు నిర్వహించేందుకు వైసీపీ నేతలు శ్రీకారం చుట్టారు. జగన్ బర్త్ డే సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పలు కార్యక్రామాలు నిర్వహించేదుకు రెడీ అయ్యారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు.

ఇప్పటికే జగన్ పుట్టిన రోజును పురస్కరించుకుని జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాల పేరుతో కొద్ది రోజులుగా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఉత్సవాలు జరుగుతున్నాయి. కళారూపాల ప్రదర్శనలతో రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేస్తున్నారు. దీనికోసం రూ.2 కోట్లను కేటాయించి వేడుకలు చేస్తున్నారు. జగన్ పుట్టిన రోజు సందర్భంగా రక్తదానం చేయడం కోసం ప్రత్యేకంగా వెబ్ సైట్ ఏర్పాటు చేసి సజ్టల రామకృష్ణారెడ్డి ఆవిష్కరించారు.

CM Jagan: రేపు బాపట్ల జిల్లాలో సీఎం జగన్ పర్యటన.. షెడ్యూల్ ఇలా..

ఇందులో ఎవరికైనా అవసరమైనప్పుడు రక్తదానం చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. గతంలో 38 వేల యూనిట్ల రక్తదానం చేశారని తెలిపారు. ఈ సారి రికార్డు బ్రేక్ చేసే విధంగా రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. ఈసారి వైఎస్సార్ సీపీ బ్లడ్ డొనేషన్ డాట్ కామ్ పేరుతో వెబ్ సైట్ ప్రారంభించామని పేర్కొన్నారు.