CM Jagan: రేపు బాపట్ల జిల్లాలో సీఎం జగన్ పర్యటన.. షెడ్యూల్ ఇలా..

సీఎం జగన్ మోహన్ రెడ్డి బుధవారం బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం యడ్లపల్లిలో పర్యటిస్తారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేస్తారు. అదేవిధంగా పలు కార్యక్రమాల్లోనూ జగన్ పాల్గొంటారు.

CM Jagan: రేపు బాపట్ల జిల్లాలో సీఎం జగన్ పర్యటన.. షెడ్యూల్ ఇలా..

CM Jagan

CM Jagan: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రేపు (బుధవారం) బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. రేపు సీఎం జగన్ పుట్టినరోజు కావటంతో రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు వైసీపీ శ్రేణులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఆయా జిల్లాల్లో పార్టీ ముఖ్యనేతల ఆధ్వర్యంలో జగన్ బర్త్ డే వేడుకల సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. అయితే, సీఎం జగన్ మాత్రం బాపట్ల జిల్లాలో పర్యటించి 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ లు పంపిణీ చేస్తారు.

CM Jagan Warning : ఆ 32మంది ఎమ్మెల్యేలకు సీఎం జగన్ వార్నింగ్.. వారిలో మంత్రులు కూడా

సీఎం జగన్ మోహన్ రెడ్డి బుధవారం బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం యడ్లపల్లిలో పర్యటిస్తారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేస్తారు. అదేవిధంగా పలు కార్యక్రమాల్లోనూ జగన్ పాల్గొంటారు. ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు జగన్ పర్యటన సాగుతుంది.

CM Jagan Cabinet : వద్ధాప్య పెన్షన్‌ను రూ.2,750కి పెంచిన జగన్ ప్రభుత్వం.. గతంలో ఎంత? ఇప్పటి ప్రభుత్వం ఇచ్చేది ఎంత? వివరాలు

ఉదయం 10గంటలకు తాడేపల్లి నుంచి సీఎం జగన్ మోహన్ రెడ్డి బయలుదేరుతారు. యడ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ఉదయం 11 గంటలకు చేరుకుంటారు. అక్కడే 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ లను పంపిణీ చేస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 1.30 గంటల వరకు బహిరంగ సభ కొనసాగుతుంది. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2గంటల వరకు తాడేపల్లిలోని నివాసానికి జగన్ చేరుకుంటారు.