CM YS Jagan: టార్గెట్ కుప్పం.. 22న చంద్రబాబు అడ్డాలో సీఎం జగన్ పర్యటన.. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం

ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి ఈనెల 22న కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పర్యటనలో భాగంగా కుప్పం మున్సిపాలిటీలో రూ. 66కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి కార్య్రకమాలకు జగన్ శంకుస్థాపన చేయనున్నారు.

CM YS Jagan: టార్గెట్ కుప్పం.. 22న చంద్రబాబు అడ్డాలో సీఎం జగన్ పర్యటన.. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం

AP CM JAGAN

CM YS Jagan: ఏపీ రాజకీయాలు ఎన్నికల వాతావరణాన్ని తలపిస్తున్నాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య నువ్వానేనా అన్నట్లుగా మాటల తూటాలు పేల్చుతున్నారు. ముఖ్యంగా కుప్పం నియోజకవర్గం వేదికగా రాజకీయం రంజుగా సాగుతోంది. 2024 ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో పాగావేసేందుకు అధికార వైసీపీ టార్గెట్ గా పెట్టుకుంది. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గత కొన్నిదఫాలుగా కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి విజయం సాధిస్తూ వస్తున్నారు. ఈ సారి చంద్రబాబు కుప్పం నుంచి బరిలోకి దిగితే బాబు విజయాల పరంపరకు అడ్డుకట్ట వేయాలని వైసీపీ పట్టుదలతో ఉంది.

CM Jagan Warned Ministers : కేబినెట్ మీటింగ్ లో మంత్రులకు సీఎం జగన్ సీరియస్ వార్నింగ్..మరోసారి మంత్రివర్గంలో మార్పులు చేయమంటారా?

ఏపీలో మరోసారి అధికారంలోకి రావడంతో పాటు చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలోనూ ఈ దఫా పాగావేయాలని వైసీపీ గురిపెట్టింది. ఇప్పటికే కుప్పం మున్సిపాలిటీతో పాటు పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ వైసీపీ అత్యధిక సీట్లు సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబును ఓడించడమే లక్ష్యంగా స్థానిక వైసీపీ నేతలకు సీఎం జగన్మోహన్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పం నియోజకవర్గంపైనే పూర్తిస్థాయిలో దృష్ఠి కేంద్రీకరించారు. కుప్పం మున్సిపాలిటీతో పాటు పంచాయతీల్లో అభివృద్ధికి వైసీపీ పెద్దపీట వేస్తోంది.

CM Jagan On Teachers : ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదన్న సీఎం జగన్.. కిందపడ్డ టీచ‌ర్ క‌ళ్ల‌ద్దాల‌ను స్వయంగా వంగి తీసిచ్చిన సీఎం

కుప్పం నియోజకవర్గంలో ఇటీవల చంద్రబాబు పర్యటన సందర్భంగా ఉధ్రిక్తత వాతావరణం నెలకొంది. వైసీపీ, టీడీపీ నేతలు పోటాపోటీగా ఆందోళనలు నిర్వహించారు. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబును అడుగడుగునా అడ్డుకొనేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇరు పార్టీల నేతల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. తాజాగా సీఎం జగన్ మోహన్ రెడ్డి చంద్రబాబు ఇలాకాలా అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారు. నియోజకవర్గంలో చేపట్టే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ మేరకు కుప్పంలో సీఎం జగన్ పర్యటన తేదీ సైతం ఖరారైంది. ఈనెల 22న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుప్పంలో పర్యటిస్తారని చిత్తూరు జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాసులు, ఎమ్మెల్సీ భరత్ లు తెలిపారు. ఈ మేరకు గురువారం వారు ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి హెలిప్యాడ్ స్థలాలను పరిశీలించారు. కుప్పం మున్సిపాలిటీలో రూ.66 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నట్లు నేతలు తెలిపారు.