Latest
Covid – 19 Telugu States : తెలుగు రాష్ట్రాల్లో కరోనా కరాళ నృత్యం, ఒక్కరోజులోనే 2 వేలకు పైగా కేసులు
తెలుగు రాష్ట్రాల్లో కరోనా కరాళ నృత్యం కొనసాగుతోంది. దాదాపు రెండు వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.
Home » Andhrapradesh » Covid – 19 Telugu States : తెలుగు రాష్ట్రాల్లో కరోనా కరాళ నృత్యం, ఒక్కరోజులోనే 2 వేలకు పైగా కేసులు
తెలుగు రాష్ట్రాల్లో కరోనా కరాళ నృత్యం కొనసాగుతోంది. దాదాపు రెండు వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.
Publish Date - 6:23 am, Thu, 8 April 21
Corona cases : తెలుగు రాష్ట్రాల్లో కరోనా కరాళ నృత్యం కొనసాగుతోంది. దాదాపు రెండు వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. ఒక్కరోజులోనే 2వేల 331 కేసులు నమోదయ్యాయి. 11 మంది ప్రాణాలు కోల్పోయారు. చిత్తూరులో నలుగురు, కర్నూలులో ఇద్దరు, అనంతపురము, తూర్పుగోదావరి, కృష్ణా, నెల్లూరు, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరి చొప్పున ప్రాణాలు కోల్పోయారు. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 368 మంది కరోనా బారిన పడ్డారు. ఆ తర్వాత విశాఖపట్నంలో 298మంది, చిత్తూరు జిల్లాలో 296 మందికి కరోనా సోకింది.
తెలంగాణలోనూ కరోనా కేసులు భారీగానే పెరుగుతున్నాయి. ఒక్క రోజులో దాదాపు రెండు వేల మందికి వైరస్ సోకింది. ఐదుగురు కరోనాకు బలయ్యారు. తెలంగాణలో మొత్తం 11వేల 617యాక్టివ్ కేసులున్నాయి. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కేసుల తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్‌లో 393మంది కరోనా బారిన పడ్డారు. GHMC పరిధిలో ఈ వారం రోజుల్లోనే 2 వేలకు పైగా పాజిటివ్ కేసులు వచ్చాయ్. కరోనాపై మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేసింది తెలంగాణ వైద్యారోగ్యశాఖ. అవసరం ఉంటేనే ఇంట్లో నుంచి బయటకు రావాలని తెలిపారు మంత్రి ఈటల. కరోనా తీవ్రత ఎక్కువున్న ప్రాంతాల్లో మైక్రో కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేయకతప్పని పరిస్థితి ఉందన్నారాయన.
Read More : CM Jagan campaign : తిరుపతి బై పోల్, 14న సీఎం జగన్ ప్రచారం ?
Priyanka Chopra : ప్లీజ్.. ఇంట్లోనే ఉండండి.. కచ్చితంగా పెట్టుకోండి.. దేశ ప్రజలకు ప్రముఖ హీరోయిన్ విజ్ఞప్తి
India’s export of liquid oxygen: కరోనా వేళ..9,234మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను విదేశాలకు అమ్మిన భారత్
SBI : రాష్ట్రంలో 600మంది బ్యాంకు ఉద్యోగులకు కరోనా, ఎస్బీఐ కీలక నిర్ణయం.. ప్రత్యేక హెల్ప్‌లైన్ నెంబర్
Mask Fine : మాస్కు లేదని ఏకంగా రూ.10వేలు ఫైన్, తాట తీస్తున్న పోలీసులు
Triple Mutation Variant: ట్రిపుల్ మ్యుటేషన్ వేరియంట్.. కొవిడ్ మహమ్మారి విసురుతున్న మరో ఛాలెంజ్
Lockdown Or Night Curfew : లాక్డౌన్ లేదా నైట్ కర్ఫ్యూ..? తెలంగాణ బాటలో ఏపీ..?