Crop Holiday In AP : రాజకీయ లబ్ది కోసమే టీడీపీ ‘క్రాప్ హాలిడే’ డ్రామాలు..!

రాజకీయ లబ్ది కోసం టీడీపీ క్రాప్ హాలిడే డ్రామాలు ఆడుతోందని మంత్రి విశ్వరూప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.

Crop Holiday In AP : రాజకీయ లబ్ది కోసమే టీడీపీ ‘క్రాప్ హాలిడే’ డ్రామాలు..!

Crop Holiday In Konaseema Ap

Crop Holiday In Konaseema AP : ఏపీలో కోనసీమ రైతులు ‘క్రాప్ హాలిడే’ప్రకటించారు. ఈ ప్రకటనపై మంత్రి విశ్వరూప్ స్పందించారు. క్రాప్ హాలిడే పేరుతో టీడీపీ ప్రభుత్వంపై బురద చల్లడానికి ప్రయత్నిస్తోంది అంటూ విమర్శించారు. కోనసీమ రైతులు ఎవరు కూడా ఏవిధమైన ప్రలోభాలకు లోనవ్వకుండా క్రాఫ్ హాలిడే ను ఖండించాలి.అని మంత్రి విశ్వరూప్ పిలుపునిచ్చారు. రాజకీయ లబ్ది కోసం టీడీపీ క్రాప్ హాలిడే డ్రామాలు ఆడుతోందని దీన్ని నిజమైన రైతులు ఖండించాలని అని పిలుపునిచ్చారు. రైతు భరోసా పేరుతో ప్రభుత్వం రైతులకు మేలు చేస్తున్నందుకు క్రాప్ హాలిడే ప్రకటిస్తారా? అంటూ మంత్రి విశ్వరూప్ ప్రశ్నించారు. ఇప్పటికే సాగునీరు విడుదల చేశాం అని తెలిపిన మంత్రి టీడీపీ ప్రభుత్వంలో కనీసం సమావేశాలు కూడా ఏర్పాటు చూసుకొనివ్వలేదని మంత్రి విశ్వరూప్ విమర్శించారు.

ఏపీలో సారవంతమైన భూములున్నాయని మూడు పంటలు పండించటానికి కూడా అనువైన భూములున్నాయని అటువంటి భూములకు క్రాప్ హాలిడే ప్రకటించం ఏంటీ అని అన్నారు. రైతులు నిరభ్యంతరంగా పంటలు వేసుకోవచ్చని..ధాన్యం బకాయిలు 48 గంటల్లో జమచేస్తాం అని ప్రకటించారు. ఇప్పుడు రోడ్డు ఎక్కుతున్న రైతు నాయకులందరూ కూడా టీడీపీ హయాంలో రోడ్డెక్కలేదని…రైతులు రైతుల్లా ఉండలిగాని పార్టీ కార్యకర్తల ఉండకూడదు అని మంత్రి విశ్వరూప్ సూచించారు. కోనసీమ రైతులకు 48గంటలలో ధాన్యం బకాయిలు చెల్లించేస్తా అని మంత్రి విశ్వరూప్ హామీ ఇచ్చారు.కానీ ఇటువంటి హామీలను నమ్మేది లేదని కోనసీమ రైతులు అంటున్నట్లుగా సమాచారం.

కాగా.. రైతు సమస్యలపై ఫిర్యాదు చేసినప్పటికీ అధికార యంత్రాంగం స్పందించకపోవడంతో క్రాప్ హాలిడేకు పిలుపునిచ్చింది కోనసీమ రైతు పరిరక్షణ సమితి. దీంతో కోనసీమ రైతులు ఈ ఖరీఫ్ సీజన్‌లో క్రాప్ హాలిడే పాటించే అవకాశం ఉంది. ఇప్పటికే ఐ.పోలవరం, అల్లవరం మండలాల రైతులు క్రాప్ హాలిడే ప్రకటించారు.

తాజాగా జిల్లాలోని 12 మండలాల్లోనూ క్రాప్ హాలిడే పాటించాలని కోనసీమ రైతు పరిరక్షణ సమితి పిలుపునిచ్చింది. రైతు సమస్యలపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ, పట్టించుకోవడం లేదని, దిక్కుతోచని స్థితిలోనే క్రాప్ హాలిడే పాటిస్తున్నామని రైతులు అంటున్నారు. ఈ సందర్భంగా పలు రైతు సమస్యల్ని నేతలు ప్రస్తావిస్తున్నారు. ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యానికి సకాలంలో డబ్బులు చెల్లించడం లేదు. ఎరువులు, సాగు ఖర్చులు పెరిగిపోయాయి. పంటకు గిట్టుబాటు ధర రావడం లేదు. పంట కాలువలు, డ్రైన్ల నిర్వహణ సక్రమంగా లేక పంట పొలాలు ముంపునకు గురవుతున్నాయి. దీంతో ప్రతి ఏటా మొదటి పంటకు తీవ్రంగా నష్టం కలుగుతోంది.

ముఖ్యంగా వరికి ఎక్కువ నష్టం కలుగుతోంది. వరిసాగు గిట్టుబాటు కాకపోవడంతో 2011లోనే రైతులు క్రాప్ హాలిడే ప్రకటించారు. అప్పట్నుంచి పలు డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచుతున్నప్పటికీ, వేటినీ నెరవేర్చడం లేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లోనే క్రాప్ హాలిడే పాటిస్తున్నట్లు రైతులు చెబుతున్నారు.