Purandeswari: విశాఖ ఎంపీ స్థానం నుంచి పురంధేశ్వరి పోటీచేస్తారా.. జీవీఎల్ పరిస్థితి ఏంటి?

విశాఖలో ఇప్పుడు జీవీఎల్ పోటీ చేయాలన్నా.. ఆ సీటు ఇవ్వాల్సింది పురంధేశ్వరే. ఎందుకంటే.. ప్రెసిడెంట్‌గా ఉన్నది ఆవిడే కాబట్టి. అలాంటప్పుడు.. ఆవిడే అక్కడి నుంచి పోటీ చేయాలనుకుంటుంది గానీ..

Purandeswari: విశాఖ ఎంపీ స్థానం నుంచి పురంధేశ్వరి పోటీచేస్తారా.. జీవీఎల్ పరిస్థితి ఏంటి?

GVL Narasimha Rao, Daggubati Purandeswari

GVL Versus Purandeswari: జీవీఎల్ వర్సెస్ పురంధేశ్వరి. ప్రెసిడెంట్‌ని మార్చి పట్టుమని పది రోజులు కూడా కాలేదు. అప్పుడే.. ఏపీ బీజేపీలో విభేదాలు మొదలయ్యాయా? అని కన్ఫ్యూజ్ అవ్వొద్దు. ఈ ఇష్యూ వేరే. ఇప్పుడు విశాఖ ఎంపీ స్థానం (Visakhapatnam MP seat) నుంచి పోటీ చేసే చాన్స్.. జీవీఎల్‌కు దక్కుతుందా? మళ్లీ ఏపీ బీజేపీ అధ్యక్షురాలి (AP BJP President)గా ఉన్న పురంధేశ్వరియే అక్కడి నుంచి పోటీ చేస్తారా? అనేదే.. ఇక్కడ అసలైన పాయింట్. ఇప్పటికే.. జీవీఎల్ కర్చీఫ్ వేసి.. సీటు నాదే అంటూ లోకల్‌లో వ్యవహారాలన్నీ చక్కబెట్టుకుంటున్నారు. మరోవైపు.. పురంధేశ్వరి అక్కడ నేను కాకపోతే ఇంకెవరు పోటీ చేస్తారనే ధీమాలో ఉన్నారు. అసలు.. రాబోయే ఎన్నికల్లో విశాఖ ఎంపీ స్థానం నుంచి ఎవరు పోటీ చేసే చాన్స్ ఉంది?

మొన్నటిదాకా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న పురంధేశ్వరి.. ఇప్పుడు ఏపీ బీజేపీ ప్రెసిడెంట్. అప్పుడే.. ఆమె శక్తి సామర్థ్యాలపై ఏపీ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ మొదలైంది. ఈ క్రమంలోనే.. విశాఖ ఎంపీ సీటుపై.. పురంధేశ్వరికి, బీజేపీ సీనియర్ నేత జీవీఎల్ నరసింహారావుకు మధ్య విభేదాలు తలెత్తే చాన్స్ ఉందనే ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే.. గతంలో పురంధేశ్వరి విశాఖ నుంచే ఎంపీగా గెలిచారు. గత ఎన్నికల్లోనూ ఆవిడ అక్కడి నుంచే పోటీ చేశారు. ఇప్పుడెలాగూ బీజేపీ ప్రెసిడెంట్ తానే కావడం వల్ల.. మరోసారి విశాఖ నుంచే ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్నారట. కానీ.. ఇక్కడే అసలు చిక్కొచ్చిపడింది. విశాఖ నుంచే జీవీఎల్ కూడా పోటీ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. గత ఏడాదిగా.. ఆయన ఇదే పని మీద ఉన్నారు. విశాఖలో ఇల్లు కూడా కొనుక్కొని.. తాను విశాఖ వాసినే అనిపించుకున్నారు. ఆయనేం చేసినా.. ముందు, చివర.. విశాఖ ఉండేలా చూసుకుంటున్నారు.

అయితే.. విశాఖలో ఇప్పుడు జీవీఎల్ పోటీ చేయాలన్నా.. ఆ సీటు ఇవ్వాల్సింది పురంధేశ్వరే. ఎందుకంటే.. ప్రెసిడెంట్‌గా ఉన్నది ఆవిడే కాబట్టి. అలాంటప్పుడు.. ఆవిడే అక్కడి నుంచి పోటీ చేయాలనుకుంటుంది గానీ.. జీవీఎల్‌కు పోటీ చేసే చాన్స్ ఎందుకిస్తారనే టాక్ కూడా గట్టిగా వినిపిస్తోంది. కానీ.. బీజేపీ కేంద్ర పెద్దలతో.. జీవీఎల్‌కు కూడా మంచి రిలేషన్స్ ఉన్నాయ్. దాంతో.. ఢిల్లీ రూటులో ఆయన విశాఖ ఎంపీ టికెట్ తనకే దక్కేలా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. కానీ.. ఏపీ బీజేపీ ప్రెసిడెంట్‌గా ఉన్న పురంధేశ్వరి కూడా అక్కడి నుంచే పోటీ చేస్తానంటారా? లేక.. ఆవిడే జీవీఎల్‌కు టికెట్ ఇచ్చి పోటీ చేయిస్తారా? అన్నది.. ఆసక్తిగా మారింది.

Also Read: టీడీపీకి ఎన్డీయే నుంచి పిలుపొచ్చిందా.. చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉన్నారు?

ఎందుకంటే.. విశాఖ ఎంపీ సీటు గతంలో బీజేపీ గెలుచుకున్నదే. గత ఎన్నికల్లోనూ అక్కడి నుంచి పోటీ చేసిన పురంధేశ్వరికి 33 వేల ఓట్లు వచ్చాయి. వచ్చే ఎన్నికల్లో.. టీడీపీ, జనసేనతో పొత్తు కుదిరితే.. ఈజీగా విశాఖ నుంచి గెలిచేయొచ్చు. అలాంటప్పుడు.. గెలిచే సీటును జీవీఎల్‌కు ఇస్తారా? తానే పోటీ చేస్తానంటారా? అన్నది ఇంట్రస్టింగ్‌గా మారింది. ఒకవేళ.. పురంధేశ్వరి గనక పోటీకి సిద్ధమైతే.. జీవీఎల్ తనకున్న ఢిల్లీ పరిచయాలతో టికెట్ కన్ఫామ్ చేసుకొని.. అక్కడి నుంచి బరిలో దిగుతారా? అనేదానిపైనే డిబేట్ నడుస్తోంది.

జీవీఎల్ పోటీ చేసే చాన్స్ వస్తుందా.. రాదా?.. వివరాలకు ఈ వీడియో చూడండి