Polavaram Project: పోలవరం అంశంలో ఏపీకి రూ.26వేల 585కోట్లు ఇవ్వాలి – కేంద్ర జలశక్తి శాఖ

పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన భూమిని సేకరించడానికి, నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికే రూ.33వేల 168 కోట్లు ఖర్చు అవుతుందని కేంద్ర జల్‌శక్తి శాఖ తేల్చింది.

Polavaram Project: పోలవరం అంశంలో ఏపీకి రూ.26వేల 585కోట్లు ఇవ్వాలి – కేంద్ర జలశక్తి శాఖ

Ys Jagan

Polavaram: పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన భూమిని సేకరించడానికి, నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికే రూ.33వేల 168 కోట్లు ఖర్చు అవుతుందని కేంద్ర జల్‌శక్తి శాఖ తేల్చింది. భూసేకరణ, పునరావాసానికి ఇప్పటిదాకా రూ.6వేల 583 కోట్లను మంజూరు చేస్తే ఇంకా రూ.26వేల 585 కోట్లను ఏపీ ప్రభుత్వానికి విడుదల చేయాల్సి ఉందని పేర్కొంది.

పునరావాసం వ్యయం పెరిగిన నేపథ్యంలో 2017–18 ధరల ప్రకారం సీడబ్ల్యూసీ, ఆర్‌సీసీలు ఆమోదించిన మేరకు నిధులు విడుదల చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ అనేక సందర్భాల్లో విజ్ఞప్తి చేశారు. ఈ మొత్తాన్ని రూ.55వేల 548.87కోట్లు సవరించింది సీడబ్ల్యూసీ. దానిని ఆర్‌సీసీ రూ.47వేల 725.87కోట్లకు కుదించింది.

పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించక ముందు ప్రాజెక్టుకు రూ.5వేల 185 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుచేసింది.

ఇది కూడా చదవండి : ప్రకాశం జిల్లాలో ఒకే రోజు స్కూ్ల్లో 17 పాజిటివ్‌ కేసులు

పోలవరం ప్రాజెక్టులో ముంపునకు గురయ్యే, కుడి, ఎడమ కాలువల పనులు చేపట్టడానికి మొత్తం 1,67,339 ఎకరాలను సేకరించాలని కేంద్ర జల్‌శక్తి శాఖ నివేదికలో పేర్కొంది. ఇందులో 1,11,185 ఎకరాలకు రూ.5,642 కోట్ల పరిహారం చెల్లించి సేకరించారని తెలిపింది. మిగతా 56,154 ఎకరాల భూసేకరణకు రూ.7,425 కోట్లను ఖర్చుచేయాల్సి ఉందని పేర్కొంది.