East Godavari : రామయ్య తండ్రికి..సిద్ధమౌతున్న గోటి తలంబ్రాలు

భద్రాచలం సీతారామ కళ్యాణానికి 11 ఏళ్లుగా కోటి తలంబ్రాలు అందిస్తున్నారు. 6 ఏళ్ల నుంచి ఒంటిమిట్ట శ్రీరామనవమికీ కూడా కోటితలంబ్రాలు అందిస్తున్నారు...

East Godavari : రామయ్య తండ్రికి..సిద్ధమౌతున్న గోటి తలంబ్రాలు

Goti Talambralu

Goti Talambralu : రామయ్య కల్యాణానికి గోటి తలంబ్రాలు సిద్ధమవుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా గోకవరంకు చెందిన రామ భక్తులు.. వానరుల వేషధారణతో.. వరి కోతలు కోసి.. కుప్పనూర్చి, ధాన్యం వేరు చేశారు. రామనామ జపం చేస్తూ.. గోటితో ఒడ్లు వలిచి కోటితలంబ్రాలను సిద్ధం చేస్తున్నారు. ఈ కోటి తలంబ్రాలను భద్రాచలం, ఒంటిమిట్ట రామాలయాల్లో జరిగే సీతారామ కల్యాణాలకు అందిస్తారు.

Read More : 2024 Election : రాహుల్..ఆర్‌జీ కనెక్ట్ పేరుతో యాప్..ఊరూరా వాట్సాప్ గ్రూపులు

తూర్పుగోదావరి జిల్లా కోరుకొండకు చెందిన శ్రీకృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో ప్రతీ ఏటా భద్రాచలం, ఒంటిమిట్ట రామాలయాల్లో.. సీతారామ కల్యాణాలకు .. గోటితో ఒలిచిన కోటి తలంబ్రాలు అందిస్తారు. ఇందుకోసం స్వయంగా రామ పంట పండిస్తున్నారు. దాదాపు 3 నెలలు శ్రమించి పంట పండించి.. 8వందల కేజీలు బియ్యంను గోటితో వలిచి .. కోటి తలంబ్రాలు తయారు చేస్తున్నారు. ఈ కోటి తలంబ్రాల తయారీలో 60 గ్రామాల్లోని రామభక్తులు పాల్గొంటున్నారు.

Read More : BJP Muralidhara Rao : సీఎం కేసీఆర్ ను జైలుకు పంపడం ఖాయం : మురళీధరరావు

అంతేకాదు వివిధ రాష్ట్రాల్లో ఉంటున్న కొందరు రామ భక్తులు కూడా ఈ మహత్కార్యంలో పాలుపంచుకునేందుకు .. 2వందల గ్రాముల ప్యాకెట్ల రూపంలో ఒడ్లను వారికి పంపిస్తున్నారు. ఈ ఏడాది కోటి తలంబ్రాల కార్యక్రమం ప్రారంభం కావడంతో .. సీతమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భద్రాచలం సీతారామ కళ్యాణానికి 11 ఏళ్లుగా కోటి తలంబ్రాలు అందిస్తున్నారు. 6 ఏళ్ల నుంచి ఒంటిమిట్ట శ్రీరామనవమికీ కూడా కోటితలంబ్రాలు అందిస్తున్నారు.