Fake Challans : నకిలీ చలానాల స్కాంను చేధించిన కృష్ణా జిల్లా పోలీసులు

ఏపీలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో నకిలీ చలాన్ల కుంభకోణం వెలుగుచూసింది. రాష్ట్రంలో అతిపెద్ద నకిలీ చలానా భాగోతం కృష్ణా జిల్లా మండవల్లి సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో జరిగింది.

Fake Challans : నకిలీ చలానాల స్కాంను చేధించిన కృష్ణా జిల్లా పోలీసులు

Fake Challan

fake challans Scam : ఏపీలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో నకిలీ చలాన్ల కుంభకోణం వెలుగుచూసింది. రాష్ట్రంలో అతిపెద్ద నకిలీ చలానా భాగోతం కృష్ణా జిల్లా మండవల్లి సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో జరిగింది. సుమారు మూడున్నర కోట్ల రూపాయల నకిలీ చలానాల భాగోతం మండవల్లిలో చోటుచేసుకుంది. రిజిస్ట్రేషన్ల శాఖలో నకిలీ చలానాల్లో జరిగిన స్కాంను కృష్ణా జిల్లా పోలీసులు చేధించారు.

వీటికి సంబంధించిన వివరాలను పోలీసులు ఇవాళ మధ్యాహ్నం మీడియాకు వివరించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ చలానల్లో ఏడు కోట్ల 13 లక్షల రూపాయల కుంభకోణం జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటివరకు మూడు కోట్ల 38 లక్షల అధికార యంత్రాంగం రికవరీ చేసింది.

రాష్ట్రంలోని 11 జిల్లాల్లో 36 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నకిలీ చలానాల భాగోతం చోటు చేసుకుంది. అక్రమాలను అరికట్టడానికి ప్రతి రిజిస్టర్ కార్యాలయంలో ఇకనుంచి కొత్త సాఫ్ట్ వేర్ ప్రవేశపెట్టారు. ఇకనుంచి రిజిస్ట్రేషన్ లన్ని కొత్త సాఫ్ట్ వేర్ తోనే నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు.

ఇప్పటివరకు తేడా వచ్చిన మొత్తాన్ని రికవరీ చేయడానికి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. నకిలీ చలానా స్కాంలో బాధ్యులపై కేసులు నమోదు చేసి, క్రిమినల్ చర్యలు తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి.