Arogyasri : జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆరోగ్యశ్రీ పరిధిలోకి విష జ్వరాలు

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు ఉపశమనం కలిగించే వార్త చెప్పింది. విష జ్వరాలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి చేర్చింది. ఈ విషయాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు.

Arogyasri : జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆరోగ్యశ్రీ పరిధిలోకి విష జ్వరాలు

Arogyasri

Arogyasri : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు ఉపశమనం కలిగించే వార్త చెప్పింది. విష జ్వరాలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి చేర్చింది. ఈ విషయాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఈ మేరకు సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో నమోదవుతున్న డెండీ, చికున్ గున్యా, మలేరియా కేసులు పెరక్కుండా చర్యలు చేపట్టినట్లు మంత్రి వివరించారు. అందులో భాగంగానే ప్రజలు చికిత్స పరంగా ఇబ్బంది పడకుండా వాటిని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చినట్లు చెప్పారు.

విశాఖ జిల్లాలో 462 డెంగ్యూ, 31 చికెన్ గున్యా, 708 మలేరియా కేసులు నమోదయ్యాయని మంత్రి తెలిపారు. ఈ సంఖ్య ఇంకా పెరగకుండా, ప్రజలు చికిత్స పరంగా ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారని మంత్రి నాని తెలిపారు. ఇప్పటికే జిల్లాలో విషజ్వరాలు ఎక్కువగా నమోదవుతున్నందున దగ్గర అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తం అయిందన్నారు. ఎక్కువ కేసులు ఉన్నచోట స్పెషల్ శానిటేషన్ డ్రైవ్, మెడికల్ క్యాంపులు నిర్వహించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. విష జ్వరాలను గుర్తించడానికి రెగ్యులర్‌గా సర్వే జరుగుతుందన్నారు. టెస్ట్స్ ఎక్విప్ మెంట్, మందులు సిద్దంగా ఉంచాలని అధికారులకు చెప్పామన్నారు. మిగతా జిల్లాల కంటే విశాఖ జిల్లాలో విషజ్వరాలు కాస్త ఎక్కువగా ఉన్నాయని మంత్రి ఆళ్ల నాని చెప్పారు.

సీజనల్ వ్యాధులపై ఇటీవలే మంత్రి ఆళ్ల నాని అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ‘‘ప్రభుత్వం సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉంది. ఎక్కడైతే డెంగ్యూ, మలేరియా వ్యాధులు ఎక్కువ వస్తున్నాయో.. అక్కడ ప్రత్యేక దృష్టి పెట్టాలి. ప్రత్యేకంగా శానిటేషన్ డ్రైవ్ నిర్వహించాలి’’ అని అధికారులను ఆదేశించారు.

‘‘జ్వరాలకు సంబంధించిన సర్వే చేయాలి. ఏ ప్రాంతంలో అయితే ఎక్కువగా వ్యాధులు నమోదవుతున్నాయో ఆ ప్రాంతంలో జ్వరాలకు సంబంధించిన నిర్ధారణ పరీక్షల శిబిరాలను ఏర్పాటు చేయాలి. ఆ ప్రాంతంలోనే ప్రత్యేకంగా జ్వరాల ట్రీట్మెంట్‌కి సంబంధించిన స్పెషల్ క్యాంపులు ఏర్పాటు చేసి వైద్యం అందించాలి’’ అని ఆళ్ల నాని సూచించారు.

‘‘మురికివాడలు, ఏజెన్సీ ప్రాంతాల్లో అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎప్పటికప్పుడు నీరు నిల్వ ఉండకుండా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలి. సీజనల్ వ్యాధులను మానిటరింగ్ చేయడానికి జిల్లాకు ఒక ప్రత్యేక అధికారి నియమించాం. ఆరోగ్యశాఖ మున్సిపల్ పంచాయితీ శాఖలకు సంబంధించిన అధికారులు సమన్వయంతో పనిచేయాలి. మందులు అందుబాటులో ఉంచాలి. ఎక్కడైనా ప్రైవేట్ హాస్పిటల్స్‌లో అధిక ఫీజులు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటాం’’ అని ఆళ్ల నాని అన్నారు.