Chinthamaneni Prabhakar : DSPపై DGPకి ఫిర్యాదు చేసిన చింతమనేని ప్రభాకర్
టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పోలీసుల తీరు పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం తప్పు చేశానని నా షర్టు చింపేశారు? అంటూ ప్రశ్నించారు. తనపై దురుసుగా వ్యవహరించిన డీఎస్పీ సత్యనారాయణపై ఆగ్రహ వ్యక్తంచేశారు. చింతమనేని చినిగిన చొక్కాతోనే డీజీపీ ఆఫీసుకు వెళ్లి డీఎస్పీ సత్యనారాయణపై ఫిర్యాదు చేశారు.

Chinatamaneni Prabhakar Fire on AP police and YCP Govt
Chinthamaneni Prabhakar : టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పోలీసుల తీరు పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం తప్పు చేశానని నా షర్టు చింపేశారు? అంటూ ప్రశ్నించారు. తనపై దురుసుగా వ్యవహరించిన డీఎస్పీ సత్యనారాయణపై ఆగ్రహ వ్యక్తంచేశారు. డీఎస్పీ సత్యనారాయణపై ఫిర్యాదు చేయటానికి చింతమనేని చినిగిన చొక్కాతోనే డీజీపీ ఆఫీసుకు వెళ్లారు. డీఎస్పీ సత్యనారాయణపై ఫిర్యాదు చేశారు. పోలీసులు ఉన్నది మా చొక్కాలు చింపటానికేనా? ఇదేనా మీరు చేసే డ్యూటీ అంటూ డీజీపీ వద్ద తన ఆవేదన వెళ్లగ్రక్కారు. రేపు పోలీసులకు కూడా ఇదే పరిస్థితి వస్తే ఏం చేస్తారు. శాంతియుతంగా ధర్నా చేసే హక్కు మాకు లేదా? శాంతియుతంగా నిరసన చేస్తుంటే పోలీసులు తమపై దౌర్జన్యంగా వ్యవహరించారని డీఎస్పీ సత్యనారాయణ తన షర్టు చింపేశారని లాక్కుని తీసుకెళ్లా జీపు ఎక్కించాని తన షర్టు చింపేసిన డీఎస్పీ దురుసు ప్రవర్తనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఫిర్యాదు చేశారు చింతమనేని ప్రభాకర్.
Andhra Pradesh : జగన్ తాత దిగి వచ్చినా టీడీపీని ఏమీ చేయలేరు : చింతమనేని ప్రభాకర్
మేమన్నా తప్పులు చేస్తూ చర్యలు తీసుకోండి తప్పులేదు..కానీ అక్రమంగా కేసులు పెట్టటం ప్రశ్నిస్తే కేసులు పెట్టటం ఏంటీ అంటూ ప్రశ్నించారు. నాపై ఇప్పటి వరకు 31 కేసులు పెట్టారు. కానీ నేను కేసులు భయపడను కానీ నాపై దౌర్జన్యంగా వ్యవహరించిన డీఎస్పీ సత్యనారాయణపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఫిర్యాదు చేశారు చింతమనేని.
కాగా మాజీమంత్రి, కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య కాపు రిజర్వేషన్ల సాధన కోసం నిరాహార దీక్ష చేపట్టగా ఆయన దీక్షను భగ్నం చేసి ఏలూరు ఆస్పత్రికి తరలించారు. ఏలూరు ఆస్పత్రిలో కూడా చేగొండి దీక్షను కొనసాగిస్తున్న క్రమంలో చేగొండి హరిరామ జోగయ్యను విడుదల చేయాలంటూ టీడీపీ నేతలు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. చింతమనేని కూడా హాస్పిటల్ వద్ద ధర్నా చేపట్టారు. హరిరామ జోగయ్యను విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు చింతమనేనిని బలవంతంగా అరెస్ట్ చేసి జీపు ఎక్కించారు. ఈక్రమంలో డీఎస్పీ సత్యనారాయణ తన షర్టు చింపేశారని తనపట్ల దౌర్జన్యంగా వ్యవహరించారని చింతమనేని ఆగ్రహం వ్యక్తంచేశారు. చినిగిన షర్టుతోనే డీజీపీ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేశారు.