Sahibzada Farhan: భారత్‌తో మ్యాచ్.. రెచ్చిపోయిన పాకిస్తాన్ క్రికెటర్.. గన్ ఫైరింగ్ సెలబ్రేషన్..

అసలే భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇటువంటి సిచుయేషన్ లో గన్ ఫైరింగ్ సెలబ్రేషన్ అవసరమా అని మండిపడుతున్నారు.

Sahibzada Farhan: భారత్‌తో మ్యాచ్.. రెచ్చిపోయిన పాకిస్తాన్ క్రికెటర్.. గన్ ఫైరింగ్ సెలబ్రేషన్..

Updated On : September 21, 2025 / 10:46 PM IST

Sahibzada Farhan: ఆసియా కప్ 2025 సూపర్ ఫోర్ లో భాగంగా భారత్ తో జరిగిన కీలక మ్యాచ్ లో పాకిస్తాన్ క్రికెటర్ ఫర్హాన్ రెచ్చిపోయాడు. గ్రౌండ్ లో ఓవరాక్షన్ చేశాడు. బ్యాట్ తో గన్ ఫైరింగ్ సెలబ్రేషన్ చేశాడు.

ఈ మ్యాచ్ లో ఫర్హాన్ హాఫ్ సెంచరీ చేశాడు. దీన్ని తనదైన శైలిలో అతడు సెలబ్రేట్ చేసుకున్నాడు. గన్ పట్టుకుని ఫైరింగ్ చేసిన తరహాలో బ్యాట్ ను పట్టుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఫర్హాన్ సెలబ్రేషన్ తీరు హాట్ టాపిక్ గా మారింది. అతడి తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

అసలే భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇటువంటి సిచుయేషన్ లో గన్ ఫైరింగ్ సెలబ్రేషన్ అవసరమా అని మండిపడుతున్నారు. ఫర్హాన్ వైఖరి భారతీయులను రెచ్చగొట్టేలా, రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెంచేలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సెలబ్రేషన్ తో ఏం మేసేజ్ ఇద్దామనుకుంటున్నారు అని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇది చాలా టూమచ్ గా ఉందని, ఇలాంటి ఓవరాక్షన్ తగ్గించుకుంటే మీకే మంచిదని వార్నింగ్ ఇచ్చారు.

ఈ మ్యాచ్ లో ఫర్హాన్ కు రెండు లైఫ్ లైన్స్ లభించాయి. రెండుసార్లు అతడిచ్చిన క్యాచ్ లను మనోళ్లు డ్రాప్ చేశారు. ఈ రెండు క్యాచ్ లు అభిషేక్ శర్మ డ్రాప్ చేశాడు.

పహల్గాం ఉగ్ర దాడి తర్వాత భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఆసియా కప్ లో పాక్ తో మ్యాచ్ సందర్భంగా భారత క్రికెటర్లు పాక్ ప్లేయర్లతో కరచాలనం చేయలేదు. దీన్ని పాక్ తీవ్ర అవమానంగా భావించింది. అంతేకాదు పాక్ పై ఘన విజయాన్ని భారత సాయుధ దళాలకు అంకితం చేస్తున్నట్లు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రకటించడాన్ని పాకిస్తాన్ తట్టుకోలేకపోయింది. అప్పటి నుంచి పాక్ రగిలిపోతోంది. తాజా మ్యాచ్ లో పాక్ క్రికెటర్ ఫర్హాన్ గన్ ఫైరింగ్ సెలబ్రేషన్ చేసి ఆ టెన్షన్స్ ను మరింత పెంచినట్లైంది.

Also Read: పాకిస్థాన్‌తో మ్యాచ్‌.. మళ్లీ పాక్‌ కెప్టెన్‌కు షేక్‌హ్యాండ్‌ ఇవ్వని భారత కెప్టెన్‌