Gajuwaka Vishnumurthy : వీడు మామూలోడు కాదు.. మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి కోటి 80 లక్షలు గుంజాడు.. ఎలాగంటే..

పాలిటిక్స్ లో కాకలు తీరిన నేతలనే ఎలా బురిడీ కొట్టించాడు. కోట్ల రూపాయలు ఎలా కొల్లగొట్టాడు. దీని గురించి తెలిస్తే నోరు వెళ్లబెట్టాల్సిందే.(Gajuwaka Vishnumurthy)

Gajuwaka Vishnumurthy : వీడు మామూలోడు కాదు.. మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి కోటి 80 లక్షలు గుంజాడు.. ఎలాగంటే..

Gajuwaka Vishnumurthy

Gajuwaka Vishnumurthy : బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదివాడు. టెక్నికల్ గా మంచి ఎక్స్ పర్ట్. మంచి ఉద్యోగంలో చేరి తన టాలెంట్ ప్రూవ్ చేసుకోవాల్సినోడు పక్కదారి పట్టాడు. ఈజీ మనీకి బాగా అలవాడు పడిపోయి నేరాలకు తెరలేపాడు. ఏకంగా రాజకీయ నాయకులను టార్గెట్ చేశాడు. ఫోన్ కొట్టుడు, కోట్లు పట్టుడు స్ట్రాటజీతో బాగానే సంపాదించాడు. కానీ, అనుభవించకుండానే అడ్డంగా బుక్కైపోయాడు.

అతడి పేరు విష్ణుమూర్తి అలియాస్ సాగర్. ఊరు విశాఖపట్నంలోని గాజువాక. అసలు విష్ణు స్పెషాలిటీ ఏంటి? పాలిటిక్స్ లో కాకలు తీరిన నేతలనే ఎలా బురిడీ కొట్టించాడు. కోట్ల రూపాయలు ఎలా కొల్లగొట్టాడు. దీని గురించి తెలిస్తే నోరు వెళ్లబెట్టాల్సిందే. విష్ణు స్కెచ్ గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. సాక్ష్యాత్తు మంత్రులు, ఎమ్మెల్యేలే వలలో పడ్డారంటే విష్ణు మాయ ఏ రేంజ్ లో అర్థమవుతుంది.(Gajuwaka Vishnumurthy)

Vijayawada Crime: యువతిపై ఆటోడ్రైవర్ అత్యాచారయత్నం.. నిందితుడి అరెస్టు

వర్చువల్ ప్రైవేట్ నెట్ వర్క్ ద్వారా అతడు మోసాలకు పాల్పడేవాడు. నేను సీఎం అశోక్ గెహ్లాట్ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నా అంటూ ఎమ్మెల్యేలకు ఫోన్ కాల్స్ చేస్తాడు. నా బ్యాంకు అకౌంట్ కి వెంటేనే రూ.20 లక్షలు పంపండి అని చెబుతాడు. మీకు అందించే సెక్యూరిటీకి అది చాలా అవసరం అంటాడు. ముందు జాగ్రత్తగా వాట్సాప్ ప్రొఫైల్ పిక్ గా రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఫ్యామిలీ ఫొటో పెట్టుకునేవాడు.

Adilabad : సైబర్‌ చీటర్స్‌ నయా దందా..అధికారుల పేరుతో వసూళ్ల పర్వం

ఈ ఏడాది ఏప్రిల్ 24న తిజార నియోజకవర్గం ఎమ్మెల్యే సందీప్ యాదవ్ కి మనోడు ఫోన్ కొట్టాడు. అవే చిలక పలుకులు పలికాడు. అయితే, ఎమ్మెల్యే యాదవ్ కి ఎందుకో అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అంతే, సీన్ రివర్స్ అయ్యింది. విష్ణు మాయ పెద్ద ట్విస్ట్ తీసుకుంది. డొంక కదిలింది. తీగ కోసం రాజస్తాన్ పోలీసులు వెతికారు.

ఫోన్ కాల్ నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా అతడు విశాఖపట్నంలోని గాజువాక ప్రాంతానికి చెందిన విష్ణుమూర్తిగా గుర్తించారు. దాంతో ఇక్కడికి వచ్చిన రాజస్తాన్ పోలీసులు విష్ణుని అరెస్ట్ చేశారు. ట్రాన్సిట్ వారెంట్ పై అతడిని రాజస్తాన్ తీసుకుపోయారు. పోలీసుల విచారణలో విష్ణు లీలలు బయటపడ్డాయి. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి అతడు డబ్బులు గుంజాడని తేల్చారు. ఆ డబ్బుతో తన ప్రియురాలికి రూ.80 లక్షల ఖరీదైన ఇంటిని కొన్నాడని పోలీసులు గుర్తించారు.

Call Girl Scam : మీ ఫోన్లకు ఇలా మెసేజ్‌లు వస్తున్నాయా? కాల్ గ్లర్స్ కావొచ్చు.. జాగ్రత్త..!

ఏపీలోనూ విష్ణూమూర్తి ఇలాంటి మోసాలకు పాల్పడినట్లుగా పోలీసులు తేల్చారు. 2019లో ఏపీలో ఇద్దరు మంత్రులు, ముగ్గురు ఎమ్మెల్యేల నుంచి రూ.కోటి 80 లక్షలు వరకు వసూలు చేసినట్లుగా చెబుతున్నారు. దీనికి సంబంధించి విశాఖ సైబర్ క్రైమ్, శ్రీకాకుళం జిల్లాలోని పోలీస్ స్టేషన్ లో నాలుగు కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. చివరికి రాజస్తాన్ పోలీసులే విష్ణు మాయని చేధించారు.