Adilabad : సైబర్‌ చీటర్స్‌ నయా దందా..అధికారుల పేరుతో వసూళ్ల పర్వం

ఆదిలాబాద్‌ కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న సమయంలో అక్కడ కొందరికి ఓ మొబైల్‌ నుంచి వాట్సప్‌ మెసేజ్‌లు వచ్చాయి. అత్యవసర సమావేశంలో ఉన్నా.. ఫోన్‌ చేయలేకపోతున్నా.. డబ్బులు అవసరం. వెంటనే పంపగలరు.. అన్నది వాటి సారాంశం.

Adilabad : సైబర్‌ చీటర్స్‌ నయా దందా..అధికారుల పేరుతో వసూళ్ల పర్వం

Cyber Cheating

cyber cheaters : సైబర్‌ చీటర్స్‌ బరితెగిస్తున్నారు. తేలిగ్గా డబ్బు సంపాదన కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. టెక్నాలజీని ఉపయోగించుకుని మోసాలకు పాల్పడుతున్నారు. ఏకంగా ప్రభుత్వ ఉన్నతాధికారుల పేర్లు, ఫోటోలను వాడుకుంటున్నారు. వారికి తెలియకుండానే వారి పేరుతో మెసేజ్‌లు పంపుతూ దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వివిధ శాఖల అధికారులకు మేసేజ్‌లు పెట్టి వసూళ్ల దందాకు తెరతీస్తున్నారు. నమ్మి డబ్బులు పంపిన కొందరులు అధికారులు మోసపోతున్నారు. ఆదిలాబాద్‌లో ఇలాంటి ఓ ఘరానా దందా వెలుగు చూసింది. ఏకంగా ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ ఫోటోతో ఓ గుర్తు తెలియని వ్యక్తి డిస్‌ప్లే పిక్చర్‌ పెట్టి వసూళ్ల దందాకు తెరతీశాడు.

ఆదిలాబాద్‌ కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న సమయంలో అక్కడ కొందరికి ఓ మొబైల్‌ నుంచి వాట్సప్‌ మెసేజ్‌లు వచ్చాయి. అత్యవసర సమావేశంలో ఉన్నా.. ఫోన్‌ చేయలేకపోతున్నా.. డబ్బులు అవసరం. వెంటనే పంపగలరు.. అన్నది వాటి సారాంశం. డిస్‌ప్లే పిక్చర్‌ చూస్తే కలెక్టర్‌ ఫొటో ఉంది. మెసేజ్‌ చూసిన ఓ డాక్టర్‌ తక్షణం స్పందించారు. జిల్లా కలెక్టర్‌కు డబ్బులు అవసరం ఏంటి అని వెనుకా.. ముందు ఆలోచించకుండా.. సొమ్ము పంపారు. ఒక్కోటీ 10 వేల రూపాయల విలువ చేసే పది అమెజాన్‌ కూపన్లు కొని అవతలి వ్యక్తికి పంపారు.

Kidnap In Narasaraopet : నరసరావుపేటలో కిడ్నాప్ కలకలం.. జువెలరీ షాపులో పని చేసే వ్యక్తి అపహరణ

ఆ తర్వాత మరో లక్షన్నర రూపాయలు పంపాలని మెసేజ్‌ పెట్టడంతో ఆ డాక్టర్‌కు అప్పుడు అనుమానం వచ్చింది. కలెక్టర్‌ పేషీని సంప్రదిస్తే విషయం అర్థమైంది. వెంటనే ఆ కూపన్లను క్యాన్సిల్‌ చేస్తూ వెళ్లగా అప్పటికే ఆ వ్యక్తి మూడు కూపన్లను వాడేశాడు. తక్కిన ఏడు కూపన్లకు సంబంధించిన 70 వేల రూపాయలను వెనక్కు రాబట్టుకోగలిగారు. జిల్లా కలెక్టర్‌ సమీక్షకు హాజరైన అధికారులు.. మెసేజ్‌ చూసి ఆశ్చర్యపోయారు. ఈ విషయాన్ని వెంటనే ఎదురుగానే ఉన్న జిల్లా కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే ఆమె తన పేషీ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ విషయాన్ని సీరీయస్‌గా తీసుకున్న పోలీసులు.. దందాపై విచారణ చేస్తున్నారు. మెసేజ్‌ వచ్చిన మొబైల్‌ నంబర్‌ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. మెసేజ్‌ వచ్చిన మొబైల్‌ నంబర్‌ ఎవరి పేరిటి ఉన్నది.. ఎక్కడ నుంచి మెసేజ్‌ వచ్చింది అన్న అంశాంపై ఆరా తీస్తున్నారు. మొబైల్‌ ఆపరేటర్లలో సంప్రదింపులు జరిపి.. కేటుగాడిని పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, హర్యానా రాష్ట్రాలతో పాటు ఢిల్లీ నుంచి సైబర్ నేరగాళ్లు ఈ తరహా నేరాలకు పాల్పడుతుంటారని పోలీసులు చెబుతున్నారు.