AP New Districts : కొత్త జిల్లాలపై ఫైనల్ గెజిట్ నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు తుది దశకు చేరుకుంది. ఈ విషయంలో విపక్షాల విమర్శలు.. అభ్యంతరాలు సంగతి ఎలా ఉన్నా.. సీఎం జగన్ దూకుడుగానే...

AP New Districts : కొత్త జిల్లాలపై ఫైనల్ గెజిట్ నోటిఫికేషన్

Cm Jagan

Gazette On New Districts Formation In AP : ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు తుది దశకు చేరుకుంది. ఈ విషయంలో విపక్షాల విమర్శలు.. అభ్యంతరాలు సంగతి ఎలా ఉన్నా.. సీఎం జగన్ దూకుడుగానే ముందుకు వెళ్లారు. ముందు నుంచి ఆయన చెబుతున్నట్టుగానే.. ఉగాది నాటికి ప్రక్రియ మొత్తాన్ని పూర్తి చేసేస్తున్నారు. మరికొద్ది గంటల్లోనే ఏపీలో కొత్త జిల్లాలపై ఫైనల్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం విధించిన గడువులోపు 11 వేలకుపైగా అభ్యంతరాలు వచ్చినట్టు సమాచారం. తాజాగా వచ్చిన అభ్యంతరాల పరిశీలన తరువాత.. కేవలం డివిజన్ల పెంపు మినహా ఎలాంటి మార్పులు చేర్పులకు ఉండే అవకాశం లేదని ప్రభుత్వ వర్గాల సమాచారం.

Read More : Ap New Districts : ఏపీలో కొత్త జిల్లాలు.. అభ్యంతరాలు, సూచనల పరిశీలనకు ప్రత్యేక కమిటీ

ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న 13 జిల్లాలు ఏప్రిల్ నెల నుండి 26 జిల్లాలు కానున్నాయి. కొత్త జిల్లాల్లో కలిపిన ప్రాంతాలకు సంబంధించి, జిల్లాలకు పెట్టిన పేర్లపై.. పలు విన్నపాలతో పాటు అభ్యంతరాలు వచ్చాయి. జిల్లాలకు దేవుళ్ల పేర్లు పెట్టడంపై కూడా అభ్యంతరాలు వచ్చాయి. లౌకిక దేశంలో దేవుళ్ల పేర్లు పెట్టడంపై పలు అభ్యంతరాలు వచ్చాయి. రాజంపేట ప్రాంతంలో అన్నమయ్య స్వగ్రామం తాళ్లపాక ఉండగా రాయచోటిని జిల్లా కేంద్రంగా పెట్టడంపై స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. హిందూపురాన్ని జిల్లా కేంద్రం చేయకుండా పుట్టపర్తిని జిల్లా కేంద్రం చేయడంపైనా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. రాజకీయ ప్రాధాన్యతలను దృష్టిలో పెట్టుకొని పునర్విభజన చేశారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ అభ్యంతరాలను ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. అనుకున్న సమయానికి కొత్త జిల్లాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. అటు తిరుపతిని బాలాజీ జిల్లాగా ఏర్పాటు చేయడంపై అభ్యంతరాలు రాగా.. వాటిని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం తిరుపతి పేరుతోనే కొత్త జిల్లా ఏర్పాటు చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. 2022, మార్చి 30వ తేదీ బుధవారం గెజిట్‌ విడుదలైతే.. మార్పులపై పూర్తి క్లారిటీ రానుంది.

Read More : AP New Districts : ఏపీలో కొత్త జిల్లాలు.. ఉగాది నుంచే.. సీఎం జగన్ కీలక ఆదేశాలు

కొత్త జిల్లాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో న్యాయపరమైన చిక్కులు రాకుండా ప్రభుత్వం ముందు జాగ్రత్తలు చేపట్టింది. వినతులు, అభ్యంతరాల్లో స్వల్ప మార్పులు మినహా పెద్దగా మార్పులు చేర్పులకు అవకాశం ఉండదని తెలుస్తోంది. డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌కు.. తుది నోటిఫికేషనుకు పెద్దగా మార్పులు చేర్పులు ఉండవని సమాచారం. ప్రభత్వం ప్రకటించిన జిల్లా కేంద్రాల్లో కూడా ఎలాంటి మార్పులు ఉండవని తెలుస్తోంది. రెవెన్యూ డివిజ‌న్లపై కూడా పెద్దఎత్తున డిమాండ్లు వచ్చాయి. డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌లో చెప్పిన 11 రెవెన్యూ డివిజన్లకు అదనంగా మరో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే కొత్త జిల్లాల వారీగా కేడర్ ఎలాట్మెంట్ పూర్తయింది. కొత్త కలెక్టరేట్లల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ఆయా జిల్లాల యంత్రాంగం ఫోకస్ పెట్టింది.