Fraud : మహిమ గల నాణెం పేరుతో రూ.11 లక్షలు కాజేసిన కేటుగాళ్లు

పార్వతీపురం మండలం చినబొండపల్లి గ్రామానికి చెందిన క్రాంతి అనే వ్యక్తి..కాకినాడలో కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్న గుత్తా సుమన్‌చంద్‌ను మోసం చేశాడు. 20 రోజుల క్రాంత్రి సుమన్‌చంద్‌కు ఫోన్‌ చేసి ఒడిశాలో మహిమ గల నాణెం ఉందని చెప్పాడు.

Fraud : మహిమ గల నాణెం పేరుతో రూ.11 లక్షలు కాజేసిన కేటుగాళ్లు

Fraud

Gharana fraud : పార్వతీపురం మన్యం జిల్లాలో ఘరానా మోసం వెలుగుచూసింది. మహిమ కల్గిన కాయిన్ పేరుతో భారీ మోసానికి పాల్పడ్డ గ్యాంగ్‌ను పార్వతీపురం రూరల్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. తొమ్మిది మంది నిందితుల్లో ఏడుగురిని అరెస్ట్‌ చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నారు.

పార్వతీపురం మండలం చినబొండపల్లి గ్రామానికి చెందిన క్రాంతి అనే వ్యక్తి..కాకినాడలో కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్న గుత్తా సుమన్‌చంద్‌ను మోసం చేశాడు. 20 రోజుల క్రాంత్రి సుమన్‌చంద్‌కు ఫోన్‌ చేసి ఒడిశాలో మహిమ గల నాణెం ఉందని చెప్పాడు. దీంతో తన స్నేహితులు రవికుమార్‌, చంద్రశేఖర్‌తో కలిసి సుమన్‌చంద్ వెళ్లాడు. ఈ నెల 14న రావికొన వెళ్లి క్రాంతిని కలిశాడు.

SBI Customer Alert : ఆ మెసేజ్‌తో జాగ్రత్త.. క్లిక్ చేస్తే ఖతమే.. ఎస్బీఐ కస్టమర్లకు కేంద్రం హెచ్చరిక

ఆ సమయంలో మరో ఎనిమిది మందిని పరిచయం చేసి.. గుత్తా సుమన్‌చంద్‌ నుంచి 11 లక్షలు వసూలు చేశాడు. డబ్బులతో వెళ్లిన గ్యాంగ్ ఫోన్లు స్విచాఫ్‌ చేయడంతో పార్వతీపురం రూరల్‌ పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు. క్రాంతితో పాటు లోహిత్‌, గంగాధర్‌బాబు, రాజేంద్ర, శ్రీకాంత్, ఉదయ్ కుమార్, నవీన్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి 9 లక్షల 50 వేల రూపాయలు రికవరీ చేశారు.