ప్రకాశం జిల్లాలో తప్పిన ఘోర ప్రమాదం, పట్టాలు తప్పిన గూడ్స్ రైలు, వంతెనపై నుంచి జారిపడ్డ డీజిల్ ట్యాంకర్లు, ఎగిసిపడ్డ మంటలు

ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం సూరారెడ్డి పాలెం దగ్గర అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. విజయవాడ

ప్రకాశం జిల్లాలో తప్పిన ఘోర ప్రమాదం, పట్టాలు తప్పిన గూడ్స్ రైలు, వంతెనపై నుంచి జారిపడ్డ డీజిల్ ట్యాంకర్లు, ఎగిసిపడ్డ మంటలు

ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం సూరారెడ్డి పాలెం దగ్గర అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. విజయవాడ

ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం సూరారెడ్డి పాలెం దగ్గర అర్ధరాత్రి ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి చెన్నై వెళ్తున్న గూడ్స్‌ రైలు నాయుడు పాలెం- బాపూజీ నగర్‌ మధ్య వంతెన దాటుతుండగా చివరన ఉన్న డీజిల్‌ బోగీలు విడిపోయాయి. ట్రాక్‌ కుంగిపోవడంతో రైలు నుంచి విడిపోయిన పట్టాలు వంతెనపై నుంచి కిందపడ్డాయి. కిందపడ్డ వెంటనే పెద్ద శబ్దంతో మంటలు చెలరేగాయి.

వంతెన పైనుంచి పడిపోయిన డీజిల్ ట్యాంకర్లు:
ట్యాంకర్లు కింద పడిపోవటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీన్ని గుర్తించిన గూడ్సు రైలు డ్రైవర్, గార్డుల సమీప స్టేషన్ల సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే అప్రమత్తమైన రైల్వే అధికారులు ట్యాంకర్లను రైలు నుంచి వేరు చేసి అగ్నిమాపక సిబ్బంది సాయంతో మంటల్ని ఆర్పేశారు. ఈ ప్రమాదంలో మూడు డీజిల్ ట్యాంకర్లు అగ్నికి ఆహుతయ్యాయి. అలాగే రైల్వే ట్రాక్‌ దాదాపు 200 మీటర్ల మేర ధ్వంసమైందని అధికారులు తెలిపారు. సుమారు రూ.80లక్షల నష్టం వాటిల్లినట్టు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.

తప్పిన ఘోర ప్రమాదం:
ట్యాంకర్లు మంటల్లో కాలిపోవడంతో పాటూ బోగీలు పట్టాలపై ఉండటంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో సింగిల్ ట్రాక్‌పై రైళ్లను నడిపించారు. రైల్వే అధికారులు మరమ్మత్తులు చేపట్టారు. మంటలు సమయానికి ఆర్పేయడంతో సరిపోయింది. లేకపోతే మిగిలిన బోగీలకు కూడా మంటలు అంటుకునేవని అధికారులు చెప్పారు. భారీ ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ప్రమాదానికి కారణం అదేనా:
ట్రాక్ కుంగిపోయి ఉండడం, డీజిల్ లోడ్ ట్యాంకర్లు బరుడుగా ఉండడం వల్లే బోగీలు పట్టాలు తప్పినట్లు గుర్తించారు. బ్రిడ్జిపై నుండి కిందకు పడిన వెంటనే ట్యాంకర్ల మూతలు తెరచుకోవడం వల్ల మంటలు వ్యాపించాయి. తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఐదు ఫైరింజన్లతో మంటలను ఆర్పేశారు. దీనిపై రైల్వే అధికారులు విచారణ ఆదేశించారు. ప్రమాదానికి కారణాలు తెలుసుకోవాలన్నారు.

Read: షోకాజ్ పాలిటిక్స్ : ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఏం చెబుతారు