Andhra Pradesh : ఎన్నికల వేళ ఏపీ ప్రభుత్వానికి ఊహించని గుడ్ న్యూస్.. ఏకంగా రూ.10వేల కోట్ల సాయం

Andhra Pradesh: చంద్రబాబు సీఎంగా ఉన్నప్పటి నాటి నుంచి ఇప్పటి వైఎస్ జగన్ ప్రభుత్వం వరకు ఏపీ ప్రభుత్వం ఈ నిధులు రాబట్టుకోవడంలో చేయని ప్రయత్నం లేదు.

Andhra Pradesh : ఎన్నికల వేళ ఏపీ ప్రభుత్వానికి ఊహించని గుడ్ న్యూస్.. ఏకంగా రూ.10వేల కోట్ల సాయం

Andhra Pradesh

Andhra Pradesh – Funds : ఏపీ ప్రభుత్వానికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. 2014-15 నాటి రెవెన్యూ లోటు భర్తీకి ప్రత్యేక సాధారణ ఆర్థిక సాయం కింద రూ.10వేల 460 కోట్లను విడుదల చేసింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి విడతల వారీగా నిధులను విడుదల చేస్తూ వచ్చిన కేంద్రం.. తొలిసారిగా ఏక మొత్తంలో నిధులను రిలీజ్ చేసింది. ఎన్నికల ఏడాదిలో ఈ మొత్తాన్ని విడుదల చేయడం విశేషం.

రాష్ట్రం విడిపోయినప్పుడు 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెవెన్యూ లోటు 16వేల 078 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పటి నాటి నుంచి ఇప్పటి వైఎస్ జగన్ ప్రభుత్వం వరకు ఏపీ ప్రభుత్వం ఈ నిధులు రాబట్టుకోవడంలో చేయని ప్రయత్నం లేదు. చివరికి జగన్ ప్రభుత్వంలో ఈ మొత్తంలో 10వేల 460 కోట్లు సాధించుకోవడంతో ఏపీ ఆర్థిక పరిస్థితికి కొంత చేయూత లభించినట్లైంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన సమయంలో ఆర్థిక వనరులు తక్కువగా ఉన్న ఏపీకి రెవెన్యూ లోటు రూ.16వేల 078 కోట్లుగా తేల్చారు. కాగ్ ధృవీకరించిన ప్రకారం రెవెన్యూ లోటును విడుదల చేయాలని అప్పటి సీఎం చంద్రబాబు.. కేంద్రాన్ని కోరారు. ఆ సమయంలో ఆర్థిక లోటు లెక్క సరిగా లేదని కొర్రీలు పెడుతూ వచ్చింది కేంద్రం. దీంతో ఆర్థిక లోటు భర్తీ కోసం ఎన్నోసార్లు కేంద్రానికి విజ్ఞప్తులు చేశారు. 2014-15లో రూ.2వేల 303 కోట్లు, 2015-16లో కేవలం రూ.500 కోట్లు, 2016-17లో రూ.1176 కోట్లు కలిసి మొత్తం సుమారు 4వేల కోట్లు మాత్రమే విడుదల చేసింది.

Also Read..Nara Lokesh : అప్పుడు బాబాయ్‌కి గుండెపోటు అన్నారు, ఇప్పుడు తల్లికి గుండెపోటు అంటున్నారు- చాలా భయంగా ఉందన్న లోకేశ్

ప్రామాణిక వ్యయం ఆధారంగా బ్యాలెన్స్ నిధులను విడతల వారీగా ఇస్తామని 2016 సెప్టెంబర్ లో మాట చెప్పి వదిలేసింది. ఇంకా రూ.139 కోట్లు మాత్రమే ఇవ్వాల్సి ఉందని, మిగిలినదంతా కొత్త పథకాల కోసం ఖర్చు చేశారని 2017లో నాటి ఆర్థిక శాఖామంత్రి అన్నారు. దీంతో ఏపీ గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లు అయ్యింది.

2018 నుంచి కేంద్రంతో రాష్ట్ర అధికారులు చర్చలు జరుపుతూనే ఉన్నారు. కాగ్ తేల్చిన ప్రకారం రెవెన్యూ లోటు రూ.16వేల 078 కోట్లుగా పరిగణించాలని ఏపీ ప్రభుత్వం కేంద్రానికి పలుమార్లు విజ్ఞప్తులు చేస్తూనే ఉంది. 2014-15 నాటికి చెల్లించని బిల్లులు భారీగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం వేడుకుంది. అయినా కేంద్రం ఇంతకాలం ఏ మాత్రం స్పందించలేదు. ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఏపీపై కనికరం చూపలేదు.

అయితే, ఉన్నట్లుండి కేంద్ర ప్రభుత్వం ఏపీపై కరుణ చూపింది. ఎన్నికల సమీపిస్తున్న వేళ ఏపీకి ఊహించని ఊరట ఇచ్చింది. రెవెన్యూ లోటులో పెండింగ్ లోని చెల్లింపులు చేయాలని నిర్ణయించింది. రూ.10వేల 460 కోట్ల చెల్లింపులకు ఆదేశాలు ఇచ్చింది. దీంతో జగన్ సర్కార్ కు ఊపిరిపోసినట్లు అయ్యింది.