Andhra Pardesh: రేపటి నుంచి ఏపీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు హాల్ టిక్కెట్ల జారీ

ఈ పరీక్షకు సంబంధించి హాల్ టిక్కెట్ల జారీ ప్రక్రియ ఈ నెల 12న ప్రారంభం కానుంది. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు సంబంధిత వెబ్‌సైట్ల నుంచి హాల్ టిక్కెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Andhra Pardesh: రేపటి నుంచి ఏపీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు హాల్ టిక్కెట్ల జారీ

Andhra Pardesh: ఆంధ్రప్రదేశ్‌లో కానిస్టేబుల్ ఉద్యోగాల నియామక ప్రక్రియ కొనసాగుతోంది. కానిస్టేబుల్ ఉద్యోగాలకు అర్హత రాత పరీక్ష ఈ నెల 22న జరగనుంది.

Delhi airport: ఢిల్లీ ఎయిర్‌‌పోర్టులో బహిరంగ మూత్ర విసర్జన చేసిన వ్యక్తి.. అరెస్టు

ఈ పరీక్షకు సంబంధించి హాల్ టిక్కెట్ల జారీ ప్రక్రియ ఈ నెల 12న ప్రారంభం కానుంది. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు సంబంధిత వెబ్‌సైట్ల నుంచి హాల్ టిక్కెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ నియామక ప్రక్రియ ద్వారా ఏపీలో 6,100 ఉద్యోగాల్ని భర్తీ చేయనుంది. జనవరి 22న కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరగనుంది. మరోవైపు రాష్ట్రంలో 411 ఎస్‌ఐ పోస్టుల భర్తీకి సంబంధించి నియామక ప్రక్రియ ప్రారంభమైంది.

United States: అమెరికాలో దేశవ్యాప్తంగా నిలిచిపోయిన విమానాలు.. కారణం అదే!

డిసెంబరు 14న ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 18తో ముగియనుంది. ఎస్‌ఐ పోస్టులకు ఫిబ్రవరి 19న ప్రిలిమినరీ రాత పరీక్ష జరగనుంది. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లు ఫిబ్రవరి 5 నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. ఏపీలో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 7తో ముగిసింది. ఈ ఉద్యోగాలకు ఏపీవ్యాప్తంగా మొత్తం 5,09,579 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

భారీ స్థాయిలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడంతో ఈ ఉద్యోగాలకు తీవ్ర పోటీ నెలకొంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సంఖ్యను అనుసరించి, ఒక్కో ఉద్యోగానికి 83 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.