AP Corona : ఏపీలో కరోనా తగ్గుముఖం.. కొత్తగా ఎన్ని కేసులంటే.. ఆ జిల్లాని వణికిస్తున్న వైరస్

ఏపీలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి క్రమంగా అదుపులోకి వస్తోంది. కొత్త కేసులు, మరణాల్లో భారీ తగ్గుదల కనిపించింది.

AP Corona : ఏపీలో కరోనా తగ్గుముఖం.. కొత్తగా ఎన్ని కేసులంటే.. ఆ జిల్లాని వణికిస్తున్న వైరస్

Ap Corona

AP Corona : ఏపీలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి క్రమంగా అదుపులోకి వస్తోంది. కొత్త కేసులు, మరణాల్లో భారీ తగ్గుదల కనిపించింది. అయితే క్రితం రోజుతో పోలిస్తే కొత్త కేసుల్లో కొంత పెరుగుదల ఉంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 3వేల 620 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో మరో 41 మంది చనిపోయారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా కేసులు 18,85,716కి చేరాయి. కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 12,671కి చేరింది.

తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 617 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాలో 565 కేసులు, చిత్తూరు జిల్లాలో 451 కేసులు నమోదయ్యాయి. ఇక మరణాల విషయానికి వస్తే. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో ఏడుగురు కరోనాతో చనిపోయారు. కృష్ణా జిల్లాలో ఆరుగురు మృతి చెందారు. తూర్పుగోదావరి, ప్రకాశం జిల్లాల్లో ఐదుగురు చొప్పున, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో నలుగురు చొప్పున మృతి చెందారు. శ్రీకాకుళం జిల్లాలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అనంతపురం, విశాఖ జిల్లాల్లో ఇద్దరు చొప్పున, అలాగే కర్నూలు, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో ఒకరు చొప్పున మృతి చెందారు.

రాష్ట్రంలో 40,074 యాక్టివ్‌ కేసులు ఉండగా.. 18,32,971 మంది రికవరీ అయ్యారు. గడిచిన 24 గంటల్లో 5వేల 757 మంది రికవరీ అయ్యారు. అలాగే 24 గంటల్లో 91,231 కరోనా టెస్టుల నిర్వహించారు.

తూర్పు గోదావరి జిల్లాను కరోనా మహమ్మారి వణికిస్తోంది. ఆ జిల్లాలో పాజిటివ్ కేసులు తగ్గడం లేదు. ఏపీ సర్కారు అన్ని చోట్లా ఆంక్షలు సడలించినా.. ఆ జిల్లాలో మాత్రం కర్ఫ్యూని కొనసాగిస్తోంది. అధికారుల సమాచారం ప్రకారం తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువగా కోవిడ్ నిబంధన ఉల్లంఘన జరుగుతోంది. దీని వల్లే కరోనా వ్యాప్తి పెరుగుతోంది. పోలీసులు, అధికారులు ఎంత చెప్పినా స్వీయ నియంత్రణ లేకపోవడంతో కోవిడ్ కేసులు పెరిగాయని చెబుతున్నారు.