నేను తప్పు చేయలేదు, ఫ్రీ పాస్ ఉంది..కారును తన్నారు – దేవళ్ల రేవతి

  • Published By: madhu ,Published On : December 10, 2020 / 11:39 AM IST
నేను తప్పు చేయలేదు, ఫ్రీ పాస్ ఉంది..కారును తన్నారు – దేవళ్ల రేవతి

AP Vaddera Corporation Chairperson Devalla Revathi : ‘ఏ తప్పు చేయలేదు..టోల్ ప్లాజా సిబ్బందే దురుసుగా ప్రవర్తించారు..అన్ పార్లమెంటరీ వర్డ్స్ వాడారు. తన తల్లికి ఆరోగ్యం మంచిగా లేకపోతే..ఆసుపత్రికి వెళుతున్న సందర్భంలో ఆపారు..తనకు ఫ్రీ పాస్ ఉంది..కేవలం వైసీపీ పార్టీని బ్లేమ్ చేయడానికి..తనను తక్కువ చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు’ అంటూ… ఏపీ వడ్డెర కార్పొరేషన్ చైర్‌పర్సన్ దేవళ్ల రేవతి వెల్లడించారు. 2020, డిసెంబర్ 10వ తేదీ గురువారం ఉదయం వాహనం ఆపడానికి ప్రయత్నించిన సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించారనే వార్తలు హల్ చల్ చేశాయి. దీనికి సంబంధించిన వీడియోలు వైలర్ అయ్యాయి. ఘటనకు సంబంధించిన ఆమె 10tvతో మాట్లాడారు.



సోషల్ మీడియాలో జరుగుతున్నది అవాస్తవం, అరగంట పాటు ఉన్న వీడియోను విడుదల చేయాలన్నారు. తనకు ఫ్రీ పాస్ ఉంది, రెగ్యులర్ గా వెళ్లే వ్యక్తిని. ఎవ్రీ మంత్ రెన్యువల్ చేయించుకుంటానన్నారు. 65 ఏళ్ల వయస్సున్న తన తల్లి కింద పడిపోయిందని, కారులో ఆసుపత్రికి తీసుకెళుతుండగా..టోల్ ప్లాజా సిబ్బంది ఆపారన్నారు. తనకు ప్రీ పాస్ ఉందని, చాలా సేపు రిక్వెస్ట్ చేశానని చెప్పుకొచ్చారు. కానీ..తన కారు ముందు..బారికేడ్లు పెట్టి..తన్నారని ఆరోపించారు. కేవలం ఐదు నిమిషాల సీసీ టీవీ ఫుటేజ్ వదులుతున్నారని, వారి వద్దనున్న సీసీ టీవీ ఫుటేజ్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తాను ఒక రెస్పాన్సబుల్ పర్సన్ అని, డబ్బులు ముఖ్యం కాదు. ఉంటాయి..పోతాయ్ అన్నారు. అక్కడున్న సిబ్బంది అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగించారని, సివిల్ డ్రెస్ ‌లో ఉన్న వ్యక్తి ఎలా ప్రశ్నిస్తున్నాడని నిలదీశారు దేవళ్ల రేవతి.



2020, డిసెంబర్ 10వ తేదీ గురువారం ఉదయం గుంటూరు జిల్లా కాజా టోల్ గేట్ నుంచి ఆమె కారులో వెళుతున్నారు. టోల్ గేట్ సిబ్బంది STOP పేరిట ఉన్న బోర్డులు, బారికేడ్లను ఆమె వాహనానికి అడ్డు పెట్టారు. కారు దిగి టోల్ సిబ్బందిని ప్రశ్నించారు. కారుకు అడ్డంగా బారికేడ్లు పెడతారా..వాటిని విసురుగా తోసేసింది. టోల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ వ్యక్తిపై చేయి చేసుకుంది. రేవతి వీరంగంతో టోల్‌గేట్ సిబ్బంది, తోటి వాహనదారులు బెంబేలెత్తిపోయారు.