Minister Peddireddy: ఫోన్ ట్యాపింగ్ చేశామని నేను చెప్పలేదు.. తప్పుడు ప్రచారం చేస్తున్నారు

టీడీపీ నేతలు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, నేను ఫోన్ ట్రాకింగ్ ద్వారా మాజీ మంత్రి నారాయణ ఎక్కడ ఉన్నాడో గుర్తించామని చెప్పానని, కానీ దానిని వక్రీకరించి ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు అన్నానని ...

Minister Peddireddy: ఫోన్ ట్యాపింగ్ చేశామని నేను చెప్పలేదు.. తప్పుడు ప్రచారం చేస్తున్నారు

Peddireddy Ramachandra Reddy

Minister Peddireddy: టీడీపీ నేతలు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, నేను ఫోన్ ట్రాకింగ్ ద్వారా మాజీ మంత్రి నారాయణ ఎక్కడ ఉన్నాడో గుర్తించామని చెప్పానని, కానీ దానిని వక్రీకరించి ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు అన్నానని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు వయసుకు తగ్గట్లు మాట్లాడటం లేదని, ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏమైనా ఉంటే వైద్యులకు సూచించుకోవాలంటూ ఎద్దేవా చేశారు. పారదర్శకంగా ఉండేందుకే రైతు మోటార్లకు మీటర్లు పెట్టామని, వారి అకౌంట్ లో నేరుగా డిస్కం నుండి చెల్లింపులు చేస్తామని అన్నారు.

Peddireddy Counter To KTR : ఓట్ల కోస‌మే ఏపీపై విమర్శలు – కేటీఆర్‌కు మంత్రి పెద్దిరెడ్డి కౌంటర్

కానీ రైతులను చంద్రబాబు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నాడని మంత్రి విమర్శించారు. మీటర్లు పెడితే ఉరితాళ్లే అంటూ ఇష్టంవచ్చినట్లు మాట్లాడుతున్నారని, చంద్రబాబు లాంటి దరిద్రమైన భాష నేను మాట్లాడలేనని అన్నారు. కుప్పంలో ఓట్లు కోవాలి అనుకుంటే అవి మాట్లాడు.. కానీ రైతులను తప్పుదారి పట్టించొద్దంటూ మంత్రి పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టెన్త్ పేపర్ లీకేజీ వ్యవహారంలో మాజీ మంత్రి నారాయణను ఫోన్ ట్రాకింగ్ ద్వారా గుర్తించామని నేను చెబితే, దానిని ఫోన్ ట్యాపింగ్ చేశామని అన్నట్లుగా టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు. శ్రీలంకకు ఏపీకి సంబంధం ఏమిటని మంత్రి ప్రశ్నించారు.

Peddireddy Ramachandra Reddy : అనుభవంలోనూ,వయస్సులోనూ పెద్దాయనే పెద్దిరెడ్డి

ఏపీని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేలా సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నివిధాల కృషి చేస్తుంటే టీడీపీ నేతలు మాత్రం ప్రజల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి పెద్దా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి మాటలను ఇప్పటికైన మానుకోవాలని, లేకుంటే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల నుండి మంచి స్పందన వస్తుందని, ప్రజలు వైసీపీ పాలన పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని మంత్రి పెద్దారెడ్డి పేర్కొన్నారు.