Marupolu Jashwant Reddy : కశ్మీర్ ఎన్‌కౌంటర్‌లో గుంటూరు జిల్లా జవాన్‌ వీరమరణం

జమ్ముకశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో తెలుగు జవాన్ వీరమరణం పొందారు. ఏపీలోని గుంటూరు జిల్లాలోని బాపట్లకు చెందిన జవాన్ మరుపోలు జశ్వంత్‌ రెడ్డి కశ్మీర్‌లోని రాజౌరి జిల్లా సుందర్‌బని సెక్టార్‌లో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో వీరమరణం పొందారు.

Marupolu Jashwant Reddy : కశ్మీర్ ఎన్‌కౌంటర్‌లో గుంటూరు జిల్లా జవాన్‌ వీరమరణం

Marupolu Jashwant Reddy

Jawan Marupolu Jashwant Reddy encounter in kashmir : జమ్ముకశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో తెలుగు జవాన్ వీరమరణం పొందారు. ఏపీలోని గుంటూరు జిల్లాలోని బాపట్లకు చెందిన జవాన్ మరుపోలు జశ్వంత్‌ రెడ్డి వీరమరణం పొందారు. కశ్మీర్‌లోని రాజౌరి జిల్లా సుందర్‌బని సెక్టార్‌లో గురువారం (జులై 8,2021) ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో జశ్వంత్ రెడ్డి అసువులుబాసారు. ఉగ్రమూలను అంతం చేయటానికి భారత్ సైన్యం జరుపుతున్న ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ముష్కరులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు భారత జవాన్లు వీరమరణం పొందారు. వారిలో గుంటూరు జిల్లా బాపట్ల మండలం దరివాద కొత్తపాలెం గ్రామానికి చెందిన మరుపోలు జశ్వంత్‌ రెడ్డి కూడా ఉన్నారు. చిన్నవయస్సులోనే దేశానికి సేవ చేయాలనే లక్ష్యంతో 23 ఏండ్ల జశ్వంత్‌ రెడ్డి భారత సైన్యంలో చేరారు. ఐదేండ్ల క్రితం భారత సైన్యంలో చేరిన జశ్వంత్ రెడ్డి ఉగ్రవాదులకు..భారత బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో వీరమరణం పొందారు.

జశ్వంత్‌ రెడ్డి మరణంతో దరివాద కొత్తపాలెంలో తీవ్ర విషాదం నెలకొంది. దేశం కోసం సేవచేయాలని వెళ్లిన తమ బిడ్డ వీరమరణం పొందటం గర్వగానే ఉన్నాగానీ..బిడ్డను పోగొట్టుకున్న కన్నవారికి ఎప్పటికి ఈ విషాదం తీరనిదే. అతని చిన్నవయస్సులోనే ఉగ్రమాకల దాష్టీకానికి ప్రాణాలు కోల్పోయిన జశ్వంత్ రెడ్డి ఎప్పటికీ భారతీయుల గుండెల్లో నిలిచిపోతారు.

దక్షిణ కశ్మీరులో శుక్రవారం తెల్లవారుజామున ఉగ్రవాదులు, సైనికులకు మధ్య ఎదురుకాల్పులు ప్రారంభం కాగా..కుల్గాం జిల్లా రెడ్‌వానీ గ్రామంలో ఉగ్రవాదులున్నారనే పక్కా సమాచారంతో కశ్మీర్ పోలీసులు, రాష్ట్రీయ రైఫిల్స్, సీఆర్పీఎఫ్ జవాన్లు గాలింపు చేపట్టారు. జవాన్లు తమను టార్గెట్ గా చేసుకున్నారనే సమాచారంతో ఉగ్రమూకలు కూడా అప్పమత్తమై భారత బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో భారత జవాన్లు ఎదురుకాల్పులు కొనసాగించారు. ఈ కాల్పుల్లో నిన్న ఇద్దరు భారత జవాన్లు వీరమరణం పొందగా వారిలో ఏపీలోని గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన జశ్వంత్ రెడ్డి కూడా ఉన్నారు.