Jagan slams Chandra babu: దత్తపుత్రుడి పార్టీని ‘రౌడీ సేన’గా మార్చేశారు: సీఎం జగన్

టీడీపీని తెలుగు బూతుల పార్టీగా మార్చేశారని, దత్తపుత్రుడి పార్టీని రౌడీ సేనగా మార్చేశారని ఏపీ సీఎం జగన్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన జగన్ ఈ సందర్భంగా మాట్లాడారు. కుప్పం ప్రజలకు కూడా మంచి చేయని చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు కలిసి వారి నోటికి ఈ మధ్య ఎక్కువగా పనిచెబుతున్నారని అన్నారు. గతంలో కలిసి చేసిన పాలనను ఇదేం కర్మరా బాబూ అనుకోబట్టే.. 2019లో దత్త పుత్రుడ్ని, సొంతపుత్రుడ్ని.. అన్నిచోట్లా కూడా ప్రజలు ఓడగొట్టి బైబై చెప్పారని అన్నారు.

Jagan slams Chandra babu: దత్తపుత్రుడి పార్టీని ‘రౌడీ సేన’గా మార్చేశారు: సీఎం జగన్

Jagan slams Chandra babu: టీడీపీని తెలుగు బూతుల పార్టీగా మార్చేశారని, దత్తపుత్రుడి పార్టీని రౌడీ సేనగా మార్చేశారని ఏపీ సీఎం జగన్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన జగన్ ఈ సందర్భంగా మాట్లాడారు. కుప్పం ప్రజలకు కూడా మంచి చేయని చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు కలిసి వారి నోటికి ఈ మధ్య ఎక్కువగా పనిచెబుతున్నారని అన్నారు. గతంలో కలిసి చేసిన పాలనను ఇదేం కర్మరా బాబూ అనుకోబట్టే.. 2019లో దత్త పుత్రుడ్ని, సొంతపుత్రుడ్ని.. అన్నిచోట్లా కూడా ప్రజలు ఓడగొట్టి బైబై చెప్పారని అన్నారు. తాము చేసిన ఇంటింటి అభివృద్ధికి అన్ని వర్గాలూ, ప్రాంతాలూ ఓటు వేసి ప్రతి ఉప ఎన్నికల్లోనూ, ప్రతిస్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఆశీర్వదించి మనకు అనుకూలంగా తీర్పు చెప్పారని అన్నారు.

కుప్పంలో కూడా తమకు ఓటువేశారని అన్నారు. టీడీపీని చిత్తుగా ఓడించి మరోసారి రాష్ట్రవ్యాప్తంగా బైబై బాబూ అనికూడా చెప్పారని తెలిపారు. అందుకే… చంద్రబాబు ఇదేం కర్మరా బాబూ అని తన తలపట్టుకుని తాను కూర్చుకుంటే.. ఆయన పుత్రుడు, ఆయన దత్తపుడ్రుకూడా ఈ బాబుతో ఇదేం కర్మరా బాబూ అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 1995లో ఇదే బాబు చేతిలో వెన్నుపోటుకు గురైన ఎన్టీఆర్‌కూడా ఇలాంటి మనిషికి తన ఇంట్లో, తన పార్టీలో, తన కేబినెట్లో స్థానం ఇచ్చినందుకు తానుకూడా ఇదేం కర్మరా బాబూ అని తానుకూడా అనుకుని ఉంటాడని చెప్పారు. ఇలాంటి నాయకుడు రాజకీయాల్లో ఉండడం ఇదేం కర్మరా బాబూ అని రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు అనుకుంటున్నారని అన్నారు.

‘‘ఈ మధ్యకాలంలో చంద్రబాబు కొన్ని మాటలు అన్నారు. తాను రాజకీయాల్లో ఉండాలంటే… అసెంబ్లీకి వెళ్లాలంటే.. ఎన్నికల్లో తనను గెలిపిస్తే.. సరేసరి..అని ప్రజల్ని కూడా బెదిరిస్తున్నాడు. చివరకు కుప్పంలోనే గెలవలేనన్న భయం, నిరాశ, నిస్పృహలు.. చంద్రబాబు మాటల్లో, చేష్టల్లో కనిపిస్తున్నాయి. ఇలాంటి మనుషుల్ని చూసినప్పుడు, ఆయన ప్రవర్తిస్తున్న తీరును చూస్తున్నప్పుడు కొందరు సెల్‌ఫోన్‌ టవర్‌నుంచి దూకేస్తానంటారు.. రైళ్లకింద పడిపోతానంటారు.. పురుగులమందు తాగేస్తానంటారు.

చంద్రబాబు అధికార భగ్నప్రేమికుడు.. రాష్ట్ర ప్రజలను బెదిరిస్తున్నాడు. చేయని పనులకు ఎందుకు ప్రజలు ఓటేస్తారు? ఇలాంటి రాజకీయ నాయకులకు ప్రజల గుండెల్లో స్థానం ఉండదు. ప్రశ్నిస్తానన్న కొందరు కూడా ప్రశ్నించరు. వీళ్లందరిన్నీ చూసినప్పుడు ఇదేం కర్మరా బాబూ అని అనిపిస్తుంది. మీ ఇంట్లో మంచి జరిగిందా? లేదా? అని కొలమానంగా చూసుకోండి. మంచి జరిగితే.. మీ తమ్ముడికి, మీ అన్నకి, మీ బిడ్డకి తోడుగా నిలబడండి. మీకు మంచి జరిగిందా? లేదా? అన్నదే ఒక్కటే కొలమానంగా తీసుకోండి’’ అని జగన్ అన్నారు.

‘‘దేవుడి దయతో ఇవాళ నర్సాపురంలోమంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. కార్తీకమాసం పవిత్రమైన చివరి సోమవారం రోజున రూ.3,300 కోట్లు ఖర్చుతో కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశాం. ఒకేరోజున ఇన్ని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు బహుశా నర్సాపురం చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. ఆంధ్రప్రదేశ్‌ ఫిషరీస్‌ విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేస్తున్నాం. ఈ ప్రాంతం రూపు రేఖలు మార్చబోతోంది. ఆక్వా కల్చర్‌ ఈ ప్రాంతంలో ప్రధానమైనది. వాటి ఉత్పత్తులు, ఎగుమతుల్లో దేశంలోనే నంబర్‌ వన్‌ స్థానంలో ఉంది.

ఆక్వాకల్చర్‌లో నైపుణ్యాలను, పరిజ్ఞానాన్ని పెంచేందుకు ఇది తోడ్పడుతుంది. మెరుగైన ఉద్యోగాలు వస్తాయి. దేశంలో ఎక్కడ అవసరాలున్నా.. తీర్చే పరిస్థితి ఉంటుంది. డిప్లొమా నుంచి పీహెచ్‌డీ వరకూ ఆక్వా కల్చర్‌లో మానవవనరుల కొరత తీర్చడానికి ఈ యూనివర్సిటీ ఉపయోగపడుతుంది. దేశంలో రెండే రెండు ఫిషరీస్‌ యూనివర్సిటీలు ఉన్నాయి. ఒకటి తమిళనాడులో, ఒకటి కేరళలో ఉంది. మూడో యూనివర్సిటీ మన రాష్ట్రంలో రాబోతుంది. రూ.332 కోట్ల వ్యయంతో ఈ యూనివర్సిటీని ఇక్కడే ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయింది. ఇవాళ్టినుంచి పనులు మొదలుపెడుతున్నాం.

రాష్ట్రంలో మత్స్యకార సోదరుల బాగుకు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. 6 వేల మత్స్యకారుల కుటుంబాలకు నర్సాపురంలో.. మేలు చేసేలా ఇక్కడే బియ్యపు తిప్ప ఫిషింగ్‌ హార్బర్‌కూడా కాసేపటి కిందటే శంకుస్థాపన చేశాం. ఈ ఒక్క బియ్యపు తిప్పి ఫిషింగ్‌ హార్బర్‌ కోసం అక్షరాల రూ.430 కోట్ల వ్యయం చేయబోతున్నాం. ఈ రోజు రాష్ట్రంలో కూడా పూర్తిగా రూపురేఖలు మారబోతున్నాయి. మన మత్స్యకారులు ఎక్కడో గుజరాత్‌కో, ఇంకోచోటుకో వెళ్లి.. బతకాల్సిన అవసరం ఉండదు. రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా 9 ఫిషింగ్‌ హార్బర్లు రాబోతున్నాయి.

దాదాపు రూ.3500 కోట్లు దీనికోసం ఖర్చు చేస్తున్నాం. అన్నిరకాల సదుపాయాలూ ఫిషింగ్‌ హార్బర్‌ ద్వారా అందుబాటులోకి రానున్నాయి. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం రోజున దీనికి శ్రీకారం చుడుతున్నాం. ముమ్మడివరంలో ఓఎన్డీజీ కార్యకలాపాల ద్వారా ప్రభావితమైన 23 వేల మందికిపైగా మత్స్యకారులకు పరిహారాన్ని అందిస్తున్నాం. గతంలో ఇలా పరిహారం అందించిన సందర్భం లేదు. నర్సాపురం అగ్రికల్చర్‌ కంపెనీ భూములపై రైతులకు పూర్తిహక్కులు కల్పిస్తున్నాం. 1,623 మంది రైతులకు మేలు చేస్తున్నాం. ఎన్నికలప్పుడు నేను చెప్పాను.. దాన్ని ఇవాళ నిలబెట్టుకుంటున్నాం. వారికి రిజిస్ట్రేషన్‌ చేసి పట్టాలు ఇవ్వబోతున్నాం.

శాశ్వత పరిష్కారంగా ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌ చేసి పట్టాలు ఇవ్వబోతోంది. కేవలం ఎకరాకు రూ.100 లు చెల్లిస్తే చాలు.. రైతుల పేరుతోనే భూములు ఇస్తున్నాం. ఉప్పుటేరుపై రెగ్యులేటర్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నాం. రెగ్యులేటర్‌ నిర్మాణం ద్వారా సముద్రపునీరు కొల్లేరులోకి రాకుండా, ఐదో కాంటూరు వరకూ మంచినీరు నిల్వ ఉండేలా రూ.188 కోట్లతో రెగ్యులేటర్‌, బ్రిడ్జి, లాకు నిర్మాణం చేస్తున్నాం. ఇదే నర్సాపురంలో రూ.1300 కోట్లతో ఏరియా ఆస్పత్రిని కట్టాం. దీన్ని ఇవాళ ప్రారంభించాం. రూ.66 లక్షల విలువైన వైద్య పరికరాలు అందించాం.

ఆక్సిజన్‌ ప్లాంటు, జనరేటర్‌కూడా అందించాం. రక్షిత మంచినీటి సరఫరాకోసం శంకుస్థాపన చేశాం. రూ.62 కోట్లు దీనికోసం ఖర్చుచేస్తున్నాం. రూ.4 కోట్లతో నర్సాపురం బస్‌స్టేషన్‌ను ఆధునికీకరించాం. దీన్ని ఇవాళ ప్రారంభించాం. ఏనాడో బ్రిటిషర్లు నిర్మించిన ట్రెజరీ బిల్డింగుకు ఇవాళే శంకుస్థాపన చేశాం. వేగంగా అభివృద్ధి చెందుతున్న నర్సాపురానికి నాణ్యమైన విద్యుత్‌ అందించడానికి సబ్‌స్టేషన్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశాం. ప.గో.జిల్లాలో నా పాదయాత్ర జరిగినప్పుడు ఒక విచిత్రమైన పరిస్థితి.

తీర ప్రాంతం అంతా తాగునీరు లేక ఇబ్బంది పడే పరిస్థితి. గోదావరి పక్కన ఉన్నా.. తాగడానికి నీరులేదు. బోర్లు వేస్తే.. ఉప్పునీరు… సర్ఫేస్‌ వాటర్‌ కలుషితం. ఈ ప్రాంతానికి చెందిన ఈ ప్రజలకు తాగునీటి అవసరాలకోసం… ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో రూ.1400 కోట్ల వ్యయంతో ఇవాళ వాటర్‌ గ్రిడ్‌ ద్వారా రక్షిత నీటి సరఫరా ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తున్నాం. విజ్జేశ్వరం నుంచి శుద్ధిచేసిన నీటిని… పైపులైన్ల ద్వారాసరఫరా చేస్తున్నాం. కొత్త జిల్లాలు అయినా ప.గో, ఏలూరు, తూ.గో జిల్లాల్లోని నిడదవోలు, తణుకు, ఆచంట, పాలకొల్లు, నర్సాపురం, భీమవరం, ఉండి, ఉంగుంటూరు, ఏలూరు, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల ప్రజలకు, అలాగే కృష్ణా కృతివెన్ను, బంటుమిల్లి, గుడ్లవల్లేరు మండలాల్లోని ప్రజలకు రక్షిత తాగునీరు అందుతుంది.

ఇంటింటికీ అభివృద్ధి, మనిషి మనిషికీ అభివృద్ధి. నా ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు, ఓసీట్లోని పేదల సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. రూ.1,76,516 కోట్లు నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి అవినీతి లేకుండా జమచేయగలిగింది. ఈ మూడు సంవత్సరాల 5 నెలల కాలంతో గ్రామాల్లో మొదలుకుంటే.. రైతులకు అక్క చెల్లెమ్మలకు పేదలకు ఇచ్చిన ప్రతి మాటాకూడా నిలబెట్టుకున్నాం. మానిఫెస్టోను భగవద్గీతగా, ఖురాన్‌గా, బైబిల్‌గా భావించి 98 శాతం పనులు చేశాం.. చేస్తున్నాం.

మేనిఫెస్టోలో చెప్పకపోయినా అనేక పనులు చేస్తున్నాం. ఇవాళ వైద్యం, ఆరోగ్యం పరంగా, ఇళ్లస్థలాల విషయంలో, ఇళ్ల నిర్మాణాల పరంగా విద్య, వ్యవసాయం పరంగా సామాజిక న్యాయం పరంగా మహిళా సాధికారిత పరంగా పారదర్శక పాలన, వికేంద్రీకరణ ఏ రంగంలో చూసినా గతంలో ఎప్పుడూ జరగనట్టుగా చంద్రబాబు తన 45ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా గత పాలకుల ఊహకు అందని విధంగా దేవుడి దయ వల్ల ఈవర్గాలు అన్నింటికీ అండగా తోడుగా నిలిచాం’’ అని జగన్ చెప్పారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..