Nadendla Manohar: ఆ నియోజకవర్గం నాదే.. పోటీపై క్లారిటీ ఇచ్చిన జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్

గుంటూరు జిల్లాలో సమస్యలపై జనసేన పోరాటాలు చేస్తుందని నాదెండ్ల చెప్పారు. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ఒక చక్కని మార్గాన్ని వేసుకునేందుకు అధినేత ఆదేశాల మేరకు పని చేస్తామని చెప్పారు.

Nadendla Manohar: ఆ నియోజకవర్గం నాదే.. పోటీపై క్లారిటీ ఇచ్చిన జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్

Nadendla Manohar

Janasena Leader Nadendla Manohar: వచ్చే ఏడాది ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీపై జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో ఎన్నిచోట్ల జనసేన పోటీ చేస్తుందో త్వరలో చెబుతామని, నేను మాత్రం తెనాలి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతానని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కోసం అన్ని జిల్లాల్లో కార్యకర్తలతో సమీక్షలు చేస్తున్నామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగాఉన్న సమస్యలపై పోరాడుతున్న పవన్ కళ్యాణ్‌కు సపోర్టుగా అందరూ నిలబడ్డారని, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం పోవాలనే జనసేన పోరాడుతుందని చెప్పారు. వాలంటీర్ల ద్వారా పవన్ కల్యాణ్‌పై అక్రమంగా కేసులు పెట్టించారని, ఆయన వాలంటీర్ల ద్వారా వ్యవస్థకు జరుగుతున్న నష్టాలను ప్రజలకు తెలుపుతున్నారని అన్నారు.

Hyper Aadi : అంబటి రాంబాబుకి కౌంటర్ ఇచ్చిన హైపర్ ఆది.. సినిమా కలెక్షన్స్ మనం చూడక్కర్లేదు.. వాళ్ళే లెక్కలు చెప్తారు..

ముఖ్యమంత్రి కార్యాలయంలో జరుగుతున్న డేటా చోరీ గురించి ప్రజలకు తెలుపుతున్నందుకు వైసీపీ నాయకులు విమర్శిస్తున్నారని, నియంతలా ప్రవర్తించే ముఖ్యమంత్రి తన కార్యాలయంలో 225 ఫైల్స్ మిస్ అయితే  ఏం చేశాడని నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. ప్రజా జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరుకు మీరేం చేశారు? పులిచింతలలో గేటుపోతే ఇంతవరకు దిక్కులేదని అన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో విచ్చలవిడిగా డబ్బులు చేతులు మారుతున్నాయి. దీనిపై విచారణ కమిటీ వేయాలని మనోహర్ డిమాండ్ చేశారు.

Pawan Kalyan : కన్నీళ్లు పెట్టుకున్న పవన్ కల్యాణ్, బాధాకరమైన రోజు అంటూ తీవ్ర ఆవేదన

గుంటూరు జిల్లాలో సమస్యలపై జనసేన పోరాటాలు చేస్తుందని నాదెండ్ల చెప్పారు. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ఒక చక్కని మార్గాన్ని వేసుకునేందుకు అధినేత ఆదేశాల మేరకు పని చేస్తామని అన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో ఎన్ని చోట్ల జనసేన పోటీ చేస్తుందో త్వరలో చెపుతామన్న నాదెండ్ల.. నేను తెనాలి నుండి పోటీ చేస్తానని క్లారిటీ ఇచ్చారు. టీటీడీలో జరుగుతున్న అవకతవకలపై జనసేన నాయకులు పోరాడుతూనే ఉన్నారని, శ్రీవాణి ట్రస్టుకు పది వేలు జమ చేస్తే ఎందుకు రసీదు ఇవ్వరని ప్రశ్నించారు.