Pawan Kalyan : కన్నీళ్లు పెట్టుకున్న పవన్ కల్యాణ్, బాధాకరమైన రోజు అంటూ తీవ్ర ఆవేదన

త్వరగా కోలుకుని తిరిగి వస్తారని భావించాను, కానీ ఆయన ఇక మన మధ్య లేరనే వార్త నన్ను కలిసి తీవ్రంగా కలిచి వేసిందన్నారు. Pawan Kalyan - Gaddar

Pawan Kalyan : కన్నీళ్లు పెట్టుకున్న పవన్ కల్యాణ్, బాధాకరమైన రోజు అంటూ తీవ్ర ఆవేదన

Pawan Kalyan - Gaddar

Pawan Kalyan – Gaddar : ప్రజా గాయకుడు గద్దర్ మృతి పట్ల జనసేన అధినేత పవన్ కల్యాణ్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. గద్దర్ మృతికి ఆయన తన ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా గద్దర్ ను గుర్తు చేసుకుని పవన్ కల్యాణ్ ఎమోషనల్ అయ్యారు. ఇది బాధాకరమైన రోజు అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా గద్దర్ పని చేశారని, యువతను ఉద్యమం వైపుకు ప్రేరేపించడంలో గద్దర్ పాత్ర ఉందన్నారు.

హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో గద్దర్ భౌతికకాయానికి పవన్ కల్యాణ్ నివాళి అర్పించారు. అనంతరం గద్దర్ కుటుంసభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా పవన్ ఎమోషనల్ అయ్యారు. గద్దర్ కుమారుడిని కౌగిలించుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు.

హార్ట్ సర్జరీకి ముందు కూడా తాను గద్దర్ తో మాట్లాడానని పవన్ చెప్పారు. రాజకీయం పద్మవ్యూహం అని గద్దర్ తనతో చెప్పారని పవన్ వెల్లడించారు. పాటను కూడా ఆడియో రూపంలో తనకు పంపించారని గుర్తు చేసుకున్నారు. గద్దర్ త్వరగా కోలుకుని తిరిగి వస్తారని భావించాను, కానీ ఆయన ఇక మన మధ్య లేరనే వార్త నన్ను కలిసి తీవ్రంగా కలిచి వేసిందన్నారు.

Also Read..Gaddar: 1997లో గద్దర్‌పై హత్యాయత్నం.. దేశ వ్యాప్తంగా సంచలనం

తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ని కోరారు పవన్ కల్యాణ్. ఇది చాలా బాధాకరమైన రోజు అని, ఇలాంటి మంచి వ్యక్తి మన మధ్య నుంచి దూరంగా వెళ్లిపోతాడని అనుకోలేదని పవన్ వాపోయారు. గద్దర్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు జనసేనాని పవన్ కల్యాణ్.