Pawan Kalyan : 2024లో మేం అధికారంలోకి వస్తాం.. వైసీపీ వ్యతిరేక ఓట్లు చీల్చేప్రసక్తే లేదు : పవన్

2024లో మేం అధికారంలోకి వస్తాం.. అప్పటి వరకు బాగుండాలి కదా అని అన్నారు. 2024లో వైసీపీ అధికారంలోకి రాదని జోస్యం చెప్పారు.

Pawan Kalyan : 2024లో మేం అధికారంలోకి వస్తాం.. వైసీపీ వ్యతిరేక ఓట్లు చీల్చేప్రసక్తే లేదు : పవన్

Pawan

Pawan Kalyan angry  : వైసీపీ వ్యతిరేక ఓట్లు చీల్చే ప్రసక్తే లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. చాలా ఆలోచించే వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదన్నానని తెలిపారు. మంగళగిరిలో జనసేన విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎవరి పల్లకీలు మోయడానికి రాలేదని స్పష్టం చేశారు. ప్రజలను పల్లకీలు ఎక్కించడానికే ఉన్నామని తెలిపారు. వైసీపీ అరాచకం, దోపిడీ వల్ల ఏపీ శ్రీలంకలా మారుతోందని విమర్శించారు.

మద్యాన్ని నిషేధిస్తామని.. ప్రత్యేక రేటుకు ఎలా అమ్ముతారని ప్రశ్నించారు. కౌలు రైతులను చనిపోయే స్థితికి తీసుకొచ్చారని ఆరోపించారు. కర్నూలు జిల్లాలో 350 మంది కౌలు రైతులు చనిపోయారని తెలిపారు. అనంతపురం జిల్లాలో 170 మంది చనిపోయారని వెల్లడించారు. రైతుకు కులం లేదు.. రైతుకు అండగా నిలబడాలన్నారు.

Pawan Kalyan On Farmers : ఒక్కో కుటుంబానికి రూ.లక్ష – ఉగాది రోజున పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన

రైతు లేకపోతే మనకు జీవనాధారం లేదన్నారు. అన్నం పెట్టే రైతు చనిపోతుంటే బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ నడపాలంటే ఒత్తిళ్లను తట్టుకోగలిగే మానసిక స్థైర్యం కావాలన్నారు. మనల్ని మనం మనస్ఫూర్తిగా అభినందించుకోవాలని తెలిపారు. జనసేన పార్టీకి అండగా నిలబడ్డ అందరికీ ధన్యవాదాలు తెలిపారు.

2024లో మేం అధికారంలోకి వస్తాం.. అప్పటి వరకు బాగుండాలి కదా అని అన్నారు. 2024లో వైసీపీ అధికారంలోకి రాదని జోస్యం చెప్పారు. అధికారంలోకి రాని పార్టీ కోసం అధికారులు పనిచేయొద్దన్నారు.

Pawan Kalyan : మటన్, చికెన్, బ్రాందీ షాపులు పెట్టడానికా అధికారంలోకి వచ్చింది-పవన్ కళ్యాణ్

జనసేన తీర్మానాలు
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకం
అమరావతిలోనే రాజధాని వుండాలి
పెట్రోల్, డీజిల్, గ్యాస్‌లో కేంద్ర, రాష్ట్ర పన్ను వాటా తగ్గించాలి
ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతులకు రూ. లక్ష ఇచ్చి ఆదుకుంటాం
మహిళల భద్రత, శాంతి భద్రత విషయంలో ప్రభుత్వ తీరును ఎండగట్టాలి