Jobs : ఇంటర్, డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు

వరుసగా జాబ్ మేళాలు నిర్వహిస్తూ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్న ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (APSSDC) తాజాగా మరో జాబ్ మేళాను నిర్వహించనుంది.

Jobs : ఇంటర్, డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు

Job

Jobs : వరుసగా జాబ్ మేళాలు నిర్వహిస్తూ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్న ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (APSSDC) తాజాగా మరో జాబ్ మేళాను నిర్వహించనుంది. N-Fiber సంస్థలో ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహించనున్నట్లు తెలిపింది. మొత్తం 30 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. మార్కెటింగ్ ఎగ్జిక్యూటీవ్ విభాగంలో ఈ నియామకాలు చేపట్టినట్లు వెల్లడించింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 16న నెల్లూరులో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుంది.

Bhargavi : భార్గవి ఎక్కడ..? మిస్టరీగా మారిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మిస్సింగ్.. సీసీ కెమెరాలో షాకింగ్ విజువల్స్

* ఇంటర్ నుంచి డిగ్రీ వరకు విద్యార్హత కలిగిన వారు అప్లయ్ చేసుకోవచ్చు.
* అభ్యర్థుల వయస్సు 18-35 ఏళ్లు ఉండాలి.
* పురుషులు, స్త్రీలు అర్హులు.
* అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరయ్యే సమయంలో రెస్యూమ్, పాస్ పోర్ట్ సైజ్ ఫొటో, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు, డిగ్రీ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీలను వెంట తీసుకురావాలి.
* ఎంపికైన వారికి నెలకు రూ. 10 వేల వేతనం చెల్లిస్తారు. వేతనంతో పాటు ఇన్సెంటీవ్స్ ఇస్తారు.
* ఎంపికైన అభ్యర్థులు నెల్లూరులో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
* అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా www.apssdc.in వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
* ఏమైనా సందేహాలుంటే అభ్యర్థులు 8143227339, 6301529271 నంబర్లను సంప్రదించాలి.