AP : ప్రైవేట్‌ స్కూల్స్‌, కాలేజీలకు జస్టిస్‌ ఆర్‌. కాంతారావు సీరియస్‌ వార్నింగ్‌

: ఏపీలోని ప్రైవేట్‌ స్కూల్స్‌, కాలేజీలకు సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిటీ చైర్మన్‌ జస్టిస్‌ ఆర్‌. కాంతారావు. ఫీజుల దోపిడీకి పాల్పడిన

AP : ప్రైవేట్‌ స్కూల్స్‌, కాలేజీలకు జస్టిస్‌ ఆర్‌. కాంతారావు సీరియస్‌ వార్నింగ్‌

Ap Schools

Justice R.Kantha Rao : ఏపీలోని ప్రైవేట్‌ స్కూల్స్‌, కాలేజీలకు సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిటీ చైర్మన్‌ జస్టిస్‌ ఆర్‌. కాంతారావు. ఫీజుల దోపిడీకి పాల్పడినా యాక్షన్‌ తప్పదని హెచ్చరించారు. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తే ఇక నుంచి క్షమించబోమని… కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు జస్టిస్‌ ఆర్‌. కాంతారావు. పలుమార్లు హెచ్చరించినా.. రాష్ట్రంలోని ప్రైవేట్‌ విద్యా సంస్థలు తమ తీరు మార్చుకోవడం లేదని.. ఇలాగే ఫీజుల దోపిడీకి పాల్పడితే సహించబోమన్నారు.

Read More : IAF Chopper Crash : మరణంలోనూ కలిసే వెళ్లారు..నేను ఉన్నంత వరకు నువ్వు ఉండు

ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో అధిక ఫీజు వసూళ్లపై పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిటీకి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో కమిటీ చైర్మన్‌ ఇప్పటికే పలుమార్లు హెచ్చరించారు. విద్యార్థుల ఫీజు, ఉద్యోగులకు జీతాలు చెల్లించే విషయంలో కమిషన్‌, ప్రభుత్వం ఇది వరకే ఆదేశాలు ఇచ్చింది. అయినా ఇంకా ఫిర్యాదుల వస్తూనే ఉన్నాయి. దీంతో ఆయన ప్రైవేటు యాజమాన్యాల జులుంపై సీరియస్‌ అయ్యారు.

Read More : Rythu Bandhu : డిసెంబర్ 15 నుంచి రైతుల ఖాతాల్లోకి డబ్బులు..!

కోవిడ్‌ నేపథ్యంలో ఆన్‌లైన్‌ క్లాసులు ప్రారంభించిన కొన్ని విద్యాసంస్థలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు జస్టిస్‌ ఆర్‌. కాంతారావు. ఆన్‌లైన్‌క్లాసులకు అనుమతి ఇచ్చినంత మాత్రానా ఇష్టారీతిన ఫీజులు వసూలు చేసుకోమని చెప్పినట్టు కాదన్నారు. ప్రైవేట్‌ స్కూల్స్‌, జూనియర్‌ కాలేజీలు తప్పనిసరిగా ఏడాది ట్యూషన్‌ ఫీజు మాత్రమే కట్టించుకోవాలన్నారు. అదికూడా వాయిదాల్లో చెల్లించే అవకాశాన్ని తల్లిదండ్రులకు ఇవ్వాలని సూచించారు. సిబ్బందికి జీతాలు నెలనెలా అందించాలని, తొలగించిన సిబ్బందిని విధుల్లోకి తీసుకోవాలన్నారు. లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.